వైద్య ఆరోగ్య శాఖలో సీఎం జగన్ ఆదేశాలు బేఖాతర్ ?

Santhi Kala

వైద్య ఆరోగ్య శాఖలో ప్రక్షాళన  దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్న వేళా కొందరు ఉద్యోగులు, అధికారులు బిన్నంగా వ్యవహరిస్తున్నారు.డిప్యుటేషన్లను రద్దు చేసినా కూడా ఏదో ఒక సాకుతో జిల్లాల నుంచి వచ్చి  తిష్ట వేసి తమ స్థానాలకు వెళ్లకుండా అక్కడే  మకాం  వేస్తున్నారు.సీఎం,వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినా కూడా అక్కడి నుంచి కదలటం లేదని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అంటున్నారు.డిప్యుటేషన్లను రద్దు చేసిన కొందరు ఉద్యోగులు ఎందుకు స్టేట్ హెడ్ క్వార్ట్రర్స్ వదలడం లేదు. తమ స్థానాలకు వెళ్లకపోవడానికి  ఉన్న కారణమేంటి ? కొందరు మంత్రులు,ఉన్నతాధికారులతో  ఉద్యోగులు పైరవీలే  కారణమా ?  అస్సలు దీనిపై అక్కడ ఉన్న ఉద్యోగులు ఏమంటున్నారు.  


వైద్య, ఆరోగ్యశాఖలో డిప్యుటేషన్లను రద్దుచేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా డిప్యుటేషన్లపై ఉన్న వారి  లెక్కలు తీసి   తక్షణమే సొంత స్థానాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరువేల మందికిపైగా డిప్యుటేషన్ల మీద ఉన్నారని.వీరిలో వైద్య విధులలో  కీలకంగా ఉండే 54 మంది వైద్యులైతే ఏళ్ల తరబడి విధులకే హాజరు కావటంలేదని నిర్దారణకు వచ్చింది. అటు వైద్యులతో పాటు జిల్లాల వారీగా డిప్యూటీ డైరక్టర్లు , వైద్య ఆరోగ్య  శాఖలో విధులు నిర్వర్తించే వారంతా నిబంధనలకు విరుద్ధంగా సొంత స్థానాలను వదిలేసి డిప్యుటేషన్ పేరుతో ఏళ్లకు ఏళ్ళు పాతుకు పోయి విధులు నిర్వర్తిస్తున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 6000  ఉద్యోగులు ఇదే పేరుతో  ఉన్నారని తక్షణమే వారిని ఆయా స్థానాలను వదిలి  వెళ్లాలని ఆదేశించింది జగన్ ప్రభుత్వం . దీనితో తమ స్థానాల్లో కాకుండా వేరొక ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న వారంతా ఒక్కొక్కరు వెళ్తున్న కొందరు మాత్రం అక్కడే తిష్ట వేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. డిప్యుటేషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రీజనల్ డైరక్టర్లు,డీఎంహెచ్‌వోలు,ఆరోగ్యశాఖలో ఉన్న ఉన్నతాధికారుల ద్వారా తమ స్థానాలను వదిలి డిప్యుటేషన్లపై వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారని వీరి విషయంలో చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.
 
ఇదిలా ఉంటె డిప్యుటేషన్ పేరుతో వేరే ప్రాంతంలో ఉంచడం,అక్కడ తొలగించడం వళ్ళ అటు  జిల్లాల్లోను ఇటు హెడ్ క్వార్ట్రర్స్ లోను విభాగాల్లో   పర్యవేక్షణ ఉండటం లేదని కొందరూ ఉద్యోగులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ శాఖాపరమైన అంశాల విషయంలో క్షేత్ర స్థాయికి  ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని జీతాలు ఒక చోట  మరొక చోట  విధులు నిర్వర్తించడం  వళ్ళ  పనులు సజావుగా సాగడం లేదని అంటున్నారు.దాదాపు 7 ఏళ్లుగా వేరే ప్రాంతంల్లో ఉంటూ జీతాలు అక్కడే తీసుకుంటూ అక్కడి విధులను వదిలివేయడం వలన ఇప్పుడు ఆయా ప్రాంతాల పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు,జిల్లాలను వదిలి వెళ్లడం వలన పని భారం తమపై పడుతుందని దీనిపై ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన కూడా అక్కడి నుంచి వారి విధులు వారు నిర్వర్తించడానికి కదిలి రావడం లేదని ఉద్యోగులు  అంటున్నారు.ఇప్పటికే ఇదే అంశాన్ని సీఎం జగన్ అధికారులకు స్పష్టంగా చెప్పినా తమకేమీ పెట్టనట్లు అధికారులు,కొందరు డిప్యుటేషన్ పై వచ్చిన  ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని,ఇప్పటికే ఇదే అంశాన్ని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ .రీజనల్ డైరక్టర్లు,డియంహెచ్ఓల దృష్టికి తీసుకోని వెళ్లిన కూడా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఇదేమని అడిగిన వారిని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు  డిప్యుటేషన్ పై వచ్చి  హెడ్ క్వార్ట్రర్స్ లో విధులు నిర్వర్తించే వారి తీరు మరింత వివాదం అవుతుంది,అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు హైదరాబాద్ నుంచి అమరావతికి కార్యాలయాలు తరలి రాగానే సీనియార్టీ ముసుగులో అవసరం లేకున్నా  డిప్యుటేషన్ అడ్డం పెట్టుకొని కొందరు ఉద్యోగులు తిష్ట వేసి అక్రమాలకు పాల్పడు తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఎటువంటి మార్పులుచేర్పులు  చెయ్యాలన్న కూడా  వీరి ద్వారా అమలు చెయ్యాల్సి ఉండటంతో ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నారని అంటున్నారు.ఇప్పటి వరకు మంగళగిరిలోని ఫ్యామిలీ వెల్ఫేర్,గొల్లపూడిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్, విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లోను ఇలాగే ఏళ్లకు ఏళ్లుగా పాతుకుపోయారని వీరి విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని వారు మండిపడుతున్నారు,వాస్తవానికి అత్యవసరంగా వారి సేవలను వినియోగించుకోవడం కోసం డిప్యుటేషన్ పై తీసుకొచ్చిన రెండు లేదా మూడేళ్ళలో వారిని సొంత స్థానాలకు పంపాల్సి ఉన్న ఆలా చేయడం లేదని ఉద్యోగులు అంటున్నారు దీనితో వారంతా ఎక్కడో జిల్లాల నుంచి వచ్చి తమపై పెత్తనం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు,ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి కొందరు రీజనల్ డైరక్టర్లు డిప్యుటేషన్ పై వచ్చిన వారి వివరాలను హెడ్ క్వార్ట్రర్స్ పంపిన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వీరి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.డిప్యుటేషన్ పై వచ్చిన డిప్యూటీ డైరెక్టర్లు,అడ్మినిస్ట్రేషన్ ,వైటల్ స్టాటిస్టిక్స్ ,మినిస్టీరియల్ సర్వీసెస్  ,పారామెడికల్ విభాగంలో  సిబ్బంది సైతం ఇప్పటికి కొనసాగుతున్నారని వారికి సంబంధించిన జాబితాను సిద్ధం చేసి పంపడంలోనూ,పంపిన జాబితాను సిద్ధం చేసి వారిని వారి సొంత  స్థానాలకు పంపండంలోనూ ఆయా విభాగాలకు చెందిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడుతున్నారు.అయితే వీరు వారి స్థానాలకు వెళ్ళకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని , ఆయా విభాగాలకు సంబంధించి ఉన్నతాధికారులు వీరి విషయంలో పెద్దగా ఫోకస్ చెయ్యకపోవడం విధులు నిర్వర్తిస్తున్నారని అంటున్నారు, ఒకవేళ వీరి గురించి ఆరా తీసిన ఆరా తీసిన రాజకీయ పలుకుబడితో స్టేట్ హెడ్ క్వార్ట్రర్స్ లో మాత్రం అక్కడే  తిష్ట వేస్తున్నారని ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా హెడ్ క్వార్ట్రర్స్  నీ వదిలి వెళ్లలేదని  ఆర్డర్స్ కూడా సర్వ్ చెయ్యలేదని వీరిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు,సీఎం ఆదేశాలను సైతం సాక్షాత్తు లెక్క చేయపోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటో చెప్పాలని తక్షణమే హెడ్ క్వార్ట్రర్స్,జిల్లాలోని వారి సొంత గూటికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.
 
మొత్తానికి డిప్యుటేషన్ల పేరుతో  కొందరు  ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం  అవుతుంది,సీఎం ఆదేశాలు ఇచ్చినా కూడా స్పందించకపోవడంపై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు చూడాలి అధికారులు స్పందిస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: