వరంగల్ టిఆర్ఎస్ కు ఇంత లక్కీనా...? ఎన్టిఆర్ పై కేటిఆర్ ప్రసంశలు...!

Sahithya
తెలంగాణాలో తిరిగి అధికారంలోకి రావడం కోసం మంత్రి కేటిఆర్ అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. పార్టీలో సరిగా పని చేయని వారిని దారిలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీ వరుసగా సభలు సమావేశాలు కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ లో భారీ సభను నిర్వహించే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ నేతలతో మంత్రి కేటిఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న 20 నియోజక వర్గాల నేతలతో ద్విదశాబ్ది వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించా అని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
2018 తర్వాత స్తబ్దత వచ్చింది అని ఆయన తెలిపారు. 15 రోజుల్లో వ్యాక్సిన్ 98శాతం పూర్తవుతుంది అని మంత్రి పేర్కొన్నారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయి కమిటీలు పూర్తి అయ్యాయి అని తెలిపారు. 25న పార్టీ అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది అని అన్నారు ఆయన. 27న అన్ని నియోజక వర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయి అని  16395 యూనిట్లలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం అని వివరించారు. జనసమీకరణ కోసమే సమావేశాలు ఉంటాయని చెప్పారు. వరంగల్ మాకు కలిసొచ్చిన జిల్లా, అక్కడ ఏ సభ పెట్టిన  సక్సస్ అయింది అని మా సభకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వినియోగించుకుంటాం అని తెలిపారు.
ప్రజలు సహకరించాలని కోరుతున్న అన్నారు ఆయన. ఆ రోజు ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్న అన్నారు. అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల నిర్మాణం దాదాపు పూర్తయింది అని తెలిపారు. వాటిని ప్రారంభించుకుని అన్ని స్థాయిల నాయకుల కు శిక్షణ తరగతులు ప్రారంభిస్తాం అని పేర్కొన్నారు. 6 నుంచి 9 నెలల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి అని వివరించారు. పార్టీగా ప్రభుత్వం గా సాధించిన విజయాలు నెమరువేసుకుంటాం అన్నారు ఆయన. 20ఏళ్లుగా ఓ పార్టీ మనుగడ సాధించడం చాలా గొప్ప అని మంత్రి హర్షించారు. 1956 తర్వాత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ పెట్టిన టిఆర్ఎస్ మాత్రమే నిలదొక్కుకున్నాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: