ఉప‌ ఎన్నిక‌లకు కేటీఆర్ దూరం ఉండ‌టానికి కార‌ణం అదేనా?

Dabbeda Mohan Babu
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు రాష్ట్రంలో రాజ‌కీయ వేడి కి పెంచుతున్నాయి. ఇప్ప‌టికి ఈ ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటి ఫికేష‌న్ విడుద‌ల చేయ‌డంతో అన్ని పార్టీ ల త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. అందురూ ఊహించిన‌ట్టు గానే బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈట‌ల రాజేంధ‌ర్ పోటీ లో ఉంటున్నాడు. అలాగే టీఆర్ ఎస్ తెలంగాణ విద్యార్థి ఉద్య‌మ నేత గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ ను పోటీ లో ఉంచింది. అలాగే కాంగ్రెస్ కూడా విద్యార్థి ఉద్య‌మ నాయ‌కున్నే పోటీ లో ఉంచింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర నామ మాత్రంగానే ఉంటుంద‌ని తెలుస్తొంది. కానీ కొంత వ‌ర‌కు ఓట్ల ను చీల్చే అవ‌కాశం ఉంటుందని చెప్పాలి. అయితే ఈ ఉప ఎన్నిక‌ల్లో ముఖ్యం గా పోటీ మాత్రం బీజేపీ టీఆర్ ఎస్ పార్టీ ల మ‌ధ్య ఉంటుంది. ప్రచారం కూడా ముఖ్యం ఈ రెండు పార్టీ ల మ‌ధ్య వాడి వేడి గా సాగుతుంది.

అయితే ఈ ఎన్నిక‌ల ప్ర‌చారానికి టీఆర్ ఎస్ నుంచి హ‌రీష్ రావు తీవ్రంగా క‌ష్ట ప‌డుతున్నాడు. వ‌రుస‌గా రోడ్ షోలు, స‌భ‌లు నిర్వ‌హిస్తు త‌మ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని ప్ర‌చారం చేస్తున్నాడు. అయితే ఉప ఎన్నిక‌లకు సంబంధించి కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నాడు. అయితే దీనిపై కొన్ని అనుమానులు వ్య‌క్తం అవుతున్నాయి. అందు కంటే ఈ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ విజయం సాధించ‌డం కొంత వ‌ర‌కు క‌ష్ట మేన‌ని తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ కూడా ఒక  స‌ర్వే చేస‌డాని తెలుస్తోంది. దీంట్టో టీఆర్ ఎస్ కు విజ‌యం ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని తెలింద‌ని స‌మాచారం. అందుకే ప్ర‌చారం నుంచి కేటీఆర్ ను త‌ప్పించి బాధ్య‌తను మొత్తం కూడా హ‌రీష్ రావు పై పెట్టార‌ని తెలుస్తొంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓడి  పోతే కార‌ణం గా హ‌రీష్ రావు ను చూపించాల‌ని కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడ‌ని స‌మాచారం. అందు వ‌ల్ల నే ఈ ఉప ఎన్నిక‌ల‌కు కేటీఆర్ ను పూర్తి గా దూరంగా ఉంచు తున్నార‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: