ప‌వ‌న్‌పై కాపు ముద్ర‌.. లాభ‌మా... న‌ష్ట‌మా?

VUYYURU SUBHASH
జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు సామాజిక వ‌ర్గం ముద్ర వేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. జ‌రుగుతున్నాయి. దీనికి రాజకీయ కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌లేక పోయిన‌.. ప‌వ‌న్‌.. వైసీపీ ప‌న్నిన ట్రాప్‌లో చిక్కుకున్నార‌ని.. విశ్లేష‌కులు చెబుతున్నారు. ఓ సినిమా ఫంక్ష‌న్‌లో హైద‌రాబాద్‌లో మాట్లాడిన ప‌వ‌న్‌.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలో మంత్రి పేర్ని నానిపై వ్యాఖ్య‌లు సంధించారు. దీనిపై మంత్రి పేర్ని.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. ప‌వ‌న్‌ను కాపుల‌కు జ‌త‌క‌ట్టేశారు. మేం మేం.. కాపులం! అంటూ.. పేర్ని వ్యాఖ్యానించారు. అయితే.. దీనిని అప్ప‌ట్లోనే ఖండించాల్సిన ప‌వ‌న్ కానీ.. జ‌న‌సేన నాయ‌కులు కానీ.. మౌనంగా ఉన్నారు.
దీంతో ఇప్పుడు ప‌వ‌న్‌ను కాపుల‌కు ప్ర‌తినిధిగానే వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. అంటే.. ఇత‌ర సామాజిక‌వ ర్గాల‌కు.. ప‌వ‌న్‌ను దూరం చేసే భారీ వ్యూహం దీనివెనుక ఉంద‌నేది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అయితే.. దీనిని ప‌సిగ‌ట్ట‌లేక పోయిన ప‌వ‌న్‌.. త‌ర్వాత జ‌రిగిన పార్టీ స‌మావేశాల్లోనూ త‌న‌ను తాను.. కాపు సామాజిక వ ర్గానికి ప్ర‌తినిధిగా చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో రాజ‌మం డ్రిలో నిర్వ‌హించిన శ్ర‌మ‌దాన కార్య‌క్ర‌మంలోనూ ఆయ‌న ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు. కాపులు ఏక‌మ‌వ్వాల‌ని.. కోరుతూ.. ఒంట‌రి, బ‌లిజ‌ల‌ను కూడా లాగారు.
అంటే.. మొత్తంగా.. కాపుల‌కు ప‌వ‌న్‌ను ప‌రిమితం చేయాల‌నే వైసీపీ వ్యూహానికి.. ప‌వ‌న్ దాదాపు అరెస్ట్ అయిపోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇదే విష‌యం.. గ్రామాల్లోనూ.. ప‌ల్లెల్లోనూ.. హాట్ టాపిక్‌గా మారుతోంది. త‌ద్వారా.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ప‌వ‌న్ దూర‌మ‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంది. దీనిని ముందు గ్ర‌హించ‌లేక పోయిన‌.. ప‌వ‌న్‌.. వైసీపీ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇది ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌నసేన‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ఆయ‌న దూరం అవ‌డం అనేది ఇప్పుడు వైసీపీకి అత్యంత కీల‌క‌మ‌ని.. అందుకే.. వారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార ని.. చెబుతున్నారు.
ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఒక అవ‌గాహ‌న కూడా కుదిరిపోయింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో క‌మ్మ‌, కాపుల ఓటు బ్యాంకు ఏక‌మై.. వైసీపీని అధికారంలో నుంచి దింపేందుకు అవ‌కాశం ఉంటుందని టీడీపీ, జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా ఉన్నాయి.
 ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన‌ను కాపుల‌కు ప‌రిమితం చేసి.. టీడీపీఎలానూ.. క‌మ్మ‌ల‌తోనే ఉంది క‌నుక‌.. ఇత‌ర సామాజిక వ‌ర్గాలైన బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వ‌ర్గాలు స‌హా.. అగ్ర‌వ‌ర్ణాల్లోని ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌ను కాపుల‌కు ప‌రిమితం చేస్తూ.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింద‌ని.. దీనిని గ్ర‌హించ‌లేని ప‌వ‌న్‌.. పూర్తిగా త‌న‌ను తాను సామాజిక వ‌ర్గానికి ప‌రిమితం చేసుకునే రాజ‌కీయాల దిశ‌గా అడుగులు వేశార‌ని అంటున్నారు. మ‌రి వైసీపీ వ్యూహం ఏమేర‌కు ప‌నిచేస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: