ప‌వ‌న్ విష‌యంలో బాబుకు షాక్ ఇస్తోన్న త‌మ్ముళ్లు...!

VUYYURU SUBHASH
ఇటీవల పవన్ కల్యాణ్‌ని కలుపుకుని పనిచేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. పవన్‌ని కలుపుకుంటేనే జగన్‌కు చెక్ పెట్టగలమని, పైగా ఓట్లు చీలిపోకుండా ఉంటాయని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవన్ కూడా అదే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసిన గెలిచే సత్తా లేదు...పైగా ఓట్లు చీల్చి పరోక్షంగా వైసీపీకి లాభం చేకూర్చేలా పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో అదే జరిగింది...కాబట్టి ఈ సారి అలా జరగకూడదని చంద్రబాబు-పవన్‌లు కలిసి జగన్‌ని ఎదురుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

అయితే పొత్తు వల్ల జనసేనకే ఎక్కువ లాభం ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. కానీ టి‌డి‌పికి కాస్త లాభం...ఎక్కువ నష్టం ఉంది. ఒక నాలుగైదు జిల్లాలోనే టి‌డి‌పికి పొత్తు వల్ల లాభం. మిగిలిన జిల్లాల్లో అంటే...దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనసేనకు పెద్దగా ఓట్లు లేవు. అలాంటి చోట్ల టి‌డి‌పి సీట్లు త్యాగం చేసి జనసేనని నిలబెట్టడం వల్ల పావలా ఉపయోగం లేదు.

పైగా కమ్మ-కాపులు ఏకమయ్యారనే విషయం హైలైట్ అయ్యి...ఇతర వర్గాలు వైసీపీ వైపుకు మొగ్గు చూపితే టి‌డి‌పికే బొక్క. అందుకే పొత్తు విషయంలో క్లియర్‌గా ఆలోచించుకుని స్టెప్ వేయాలని సీమ టి‌డి‌పి నేతలు మాట్లాడుతున్నారు. ఇటు గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పొత్తు వల్ల బెనిఫిట్ ఉంటుంది...కాకపోతే అది జనసేనకే ఎక్కువ ప్లస్ అవుతుంది. జనసేన సీట్లలో టి‌డి‌పి వర్గాలు సహకరిస్తాయి. కానీ టి‌డి‌పికి దక్కిన సీట్లలో జనసేన వర్గాలు సహకరిస్తాయనేది డౌటే. పైగా కాపులు...పూర్తిగా టి‌డి‌పికి మద్ధతు ఇస్తారని అనుకోవడం అవివేకం అవుతుంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే గెలిచాక మరోక ఎత్తు అవుతుంది. ఒకవేళ పొత్తులో గెలిస్తే...అసలు మా వల్లే చంద్రబాబు సి‌ఎం అయ్యారని, టి‌డి‌పి అధికారంలోకి వచ్చిందని జనసేన వర్గాలు హడావిడి చేస్తాయి. 2014 ఎన్నికల్లో ఎంత హడావిడి చేసాయో ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏదేమైనా ఒంటరి పోరుకు వెళ్లడమే బెటర్ అంటున్నారు...మరి ఈ విషయంలో చంద్రబాబు డెసిషన్ ఏంటో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: