అవినాష్‌కు పవన్‌తో ఇబ్బందేనా?

M N Amaleswara rao
దేవినేని అవినాష్....అతి తక్కువ సమయంలోనే ఏపీ రాజకీయాల్లో ఫాలోయింగ్ పెంచుకున్న యువ నాయకుడు. దేవినేని నెహ్రూ వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన శైలిలో సత్తా చాటుతున్న నేత. మొన్నటివరకు టి‌డి‌పిలో కీలకంగా పనిచేశారు. చంద్రబాబు ఆదేశాలు పాటిస్తూ...గత ఎన్నికల్లో ఓడిపోయే గుడివాడ సీటులో కొడాలి నాని మీద పోటీకి దిగారు. ఇక అక్కడ ఓడిపోయాక....తెలుగు యువత అధ్యక్షుడుగా పార్టీ కోసం పనిచేశారు. ఎన్నికల్లో ఓటమి దెబ్బకు ఏ నాయకుడు బయటకు రాకపోయినా సరే...అవినాష్ ముందుకొచ్చి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు.


కానీ అలాంటి నాయకుడు టి‌డి‌పిలో ఉండే కుళ్ళు రాజకీయాలు తట్టుకోలేక వైసీపీలోకి వచ్చేశారు. ఇప్పుడు విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్‌గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో అవినాష్..ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే. అందుకే ఇప్పటినుంచే అవినాష్...నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తున్నారు. అలాగే విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగరడానికి అవినాష్ ప్రధాన కారణం.
ఇలా దూకుడుగా ఉన్న అవినాష్...నెక్స్ట్ ఎన్నికల్లో తూర్పులో టి‌డి‌పి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు చెక్ పెట్టడం ఖాయమని తెలుస్తోంది. తూర్పుపై ఇప్పటికే పట్టు పెంచుకున్న అవినాష్ విజయం సులువే అని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది...ప్రస్తుతం గద్దెపై నెగిటివ్ ఏమి లేదు...ఎమ్మెల్యేగా గద్దె కూడా మంచి పనితీరు కనబరుస్తున్నారు. ఆయనకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.
తూర్పులో గద్దె కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు...అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గానీ టి‌డి‌పికి సపోర్ట్ ఇస్తే...అవినాష్‌కు ఇబ్బందే అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో గద్దె దాదాపు 15 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీపై గెలిచారు. అదే సమయంలో ఇక్కడ జనసేనకు 16 వేల ఓట్లు పడ్డాయి. అంటే ఎటు చూసిన గద్దెకు అడ్వాంటేజ్ ఉంది. పవన్ సపోర్ట్ ఇస్తే మాత్రం పరిస్తితి మారిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకుని అవినాష్ రాజకీయంగా ఇంకా బలపడాల్సిన అవసరముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: