వచ్చే ఎన్నికల్లో మోడీని నమ్ముకుంటే కష్టమేనా..?

Chakravarthi Kalyan
దేశంలో మోదీ మేజిక్ క్రమంగా తగ్గుతోందా.. ఇప్పటికే రెండు సార్లు ప్రజలను మాయ చేసిన మోడీ.. ఇకపై మరోసారి తన మాయను రిపీట్ చేయలేరా.. చాలా మంది విశ్లేషకులు ఈ మాట అంటున్నారు. అయితే  విశ్లేషకులే కాదు.. ఇప్పుడు ఈ మాట ఏకంగా బీజేపీ నాయకులే అంటున్నారు. అవును.. వచ్చే ఎన్నికల్లో మోదీని నమ్ముకుంటే విజయం సాధించడం కష్టమేనని కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ కామెంట్ చేశారు.

ప్రధాని మోదీ ప్రజాకర్షణ శక్తితోపాటు కార్యకర్తల శ్రమ తోడైతేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యమని ఆయన అంటున్నారు. అయితే ఆయన మాట్లాడింది వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి కాదు.. త్వరలో హర్యానాలో జరగనున్న ఓ ఉప ఎన్నిక గురించి.. అవును.. ఈ నెల 30న  హర్యానాలో ఓ ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. ఈ కామెంట్లు చేశారు.

హర్యానాలో ఎలెనాబాద్ లో 30న ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ జోరుగా పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక మాత్రమే కాదు.. వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలనా ఆయన ప్రసంగించారు. ఇంకా మనం  ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెప్పుకుని పోటీ చేస్తే 45 సీట్లు సాధించడం కూడా సందేహమే అంటున్నారాయన. కార్యకర్తలంతా ఫీల్డ్ లెవల్‌లో బాగా పని చేస్తేనే విజయం సాధ్యమంటున్నారు ఈ కేంద్ర మంత్రి.

ఆయన ఇంకా ఏమంటున్నారంటే...” మోదీ ఆధ్వర్యంలో హర్యానాలో భాజపా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. మొదటిసారి 47, రెండోసారి 40 సీట్లు హర్యానాలో బీజేపీ సాధించింది. ఇంకా.. మోదీ జీ పేరుతో మనం మూడోసారి 45 మార్కును దాటగలమా అని ప్రశ్నించారు. ఎందుకంటే హర్యానాలో ఏదైనా పార్టీ మూడోసారి అధికారం చేపట్టిన చరిత్ర లేదు. బడా నేతలు  వస్తారు. బహిరంగ సభల్లో ప్రసంగాలు చేసి వెళ్తారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు  పని చేస్తేనే విజయం అని కేంద్ర మంత్రి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: