ఐ.ఎం.ఎఫ్. : ఆయుధాల.. దేశాలను గుర్తించేదిలేదు..!

Chandrasekhar Reddy
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కులాడాన్ని మరీ తుపాకుల రాజ్యాలను నెలకొల్పుతున్నారు కొందరు. అయితే అలాంటి దేశాలను దేశాలుగా గుర్తించే ఆలోచన చేయబోమని తాజాగా ఐ.ఎం.ఎఫ్. స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థను గురించి, ఆయా దేశాలలో అభివృద్ధి ని అంచనా వేసే ఐ.ఎం.ఎఫ్. తాజాగా భారత్ తదుపరి రెండేళ్లలో కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని స్పష్టం చేసింది. అలాగే ఐ.ఎం.ఎఫ్. తన జాబితాలో లెబనాన్ మరియు తాలిబన్ లను చేర్చకుండానే నివేదికను పూర్తిచేసింది. అంటే ఐ.ఎం.ఎఫ్. ఆ రెంటిని అసలు దేశాలుగానే గురించలేదు అని అర్ధం అవుతుంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి లో చొరబడే అవకాశాన్ని ఆఫ్ఘన్ పోగొట్టుకోగా, తాజాగా ఐ.ఎం.ఎఫ్. లో కూడా వారికి వ్యతిరేకంగానే నిర్ణయాలు ప్రకటించబడ్డాయి.
భారత్ టాప్ వన్ లో ఉంటుందని ఐ.ఎం.ఎఫ్. స్పష్టం చేసింది. రానున్న రెండు ఏళ్ళు భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని స్పష్టం చేసింది. అయితే లెబనాన్ మరియు తాలిబన్ లలో ప్రభుత్వాలు ఆయుధాలతో ఏర్పాటు చేశాయని, అటువంటి వారిని దేశాలుగా చూడటానికి సిద్ధంగా లేమని, ఏదైనా అత్యవసర పరిస్థితులలో మాత్రం ఏదైనా సాయం చేస్తాం అని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇలాంటి ఆయుధ ప్రభుత్వాలను స్వాగతించడం ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చిపెడుతుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఒకవేళ గుర్తించినా ప్రపంచంలో తమ ప్రాభల్యం పెంచే యత్నం చేస్తారు తప్ప, మారే లక్షణాలు వారిలో ససేమిరా లేవని స్పష్టం చేసింది ఆ సంస్థ.
ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటూ అడుగులు వేస్తున్న నేపథ్యంలో, మరోపక్క కరోనా సంక్షోభం లో వీలైతే పక్కవారికి అండగా ఉండాలి కానీ వాళ్ళ దేశాలను తుపాకులతో స్వాధీనపరుచుకున్న వారు అది తమ దేశం అన్నంత మాత్రాన జరిగిపోదని ఐ.ఎం.ఎఫ్. అభిప్రాయం వ్యక్తం చేసింది. మానవత్వం ప్రభలంగా చూపించాల్సిన సమయంలోనే రక్తపాతం చేస్తే, మిగిలిన సాధారణ సందర్భాలలో వీళ్లు ఈ తుపాకులతో ఇంకెంత చేస్తారు అనేది గమనించి ఆయా దేశాలను పరిగణ లోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చినట్టే ఉందని ఐ.ఎం.ఎఫ్. నివేదికపై పలువురు నిపుణులు స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

imf

సంబంధిత వార్తలు: