ఉపశమనం కలిగించే సడలింపులు.. అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే..!

NAGARJUNA NAKKA
భారత్ కు వచ్చే బ్రిటన్ ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్ లో పర్యటనలకు సంబంధించి గతంలో విధించిన కఠిన ఆంక్షలను తొలగిస్తున్నామని.. బ్రిటన్ వాసులు భారత్ చేరుకున్నాక 10రోజుల పాటు క్వారంటైన్ లో గడపాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ఇటీవల బ్రిటన్.. భారత్ ప్రయాణీకులపై ఆంక్షలను తొలగించగా.. భారత్ కూడా బ్రిటన్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలను తొలగించింది.
మరోవైపు కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. పీఎం కేర్ ద్వారా ఆదుకునేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా వారి అకౌంట్లలో 10లక్షల రూపాయలు డిపాజిట్ చేయనుంది. కలెక్టర్ల ద్వారా నిర్వహించిన ఎంపికలో ఏపీలో ఇప్పటి వరకు 237మందిని అర్హులుగా గుర్తించారు. డిసెంబర్ 31వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. డిపాజిట్ చేసిన సొమ్మును పిల్లలకు 23ఏళ్లు నిండిన తర్వాత అందజేస్తారు.
ఇక ఏపీలో సినిమా హాళ్లలో 100శాతం సీటింగ్ అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్లతో పాటు ఫిక్స్ డ్ సీటింగ్ ఉన్న ఫంక్షన్ హాళ్లు, సమావేశ మందిరాల్లో 100శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు, సమావేశ మందిరాల్లో 50శాతం సీటింగ్ కే అనుమతి ఉండగా.. తాజాగా 250మంది పాల్గొనేలా అనుమతి ఇచ్చింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు థరించాలని కోరింది.
ఇక కరోనా లక్షణాలున్నా.. సాధారణ జ్వరమనే భావనలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో తీవ్ర కరోనా లక్షణాలతో పదిమంది చేరారనీ.. ఆక్సిజన్ స్థాయి పడిపోయి ఐసీయూలో చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు తగ్గడంతోనే ప్రజలు ఇలా భావిస్తున్నారని తెలిపారు. లక్షణాలు కనిపించగానే కొవిడ్ టెస్ట్ కు వెళ్లాలని సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటున్నారు. కాబట్టి అందరూ ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: