కోటి కోట్ల భారత్.. ఏం జరగబోతోంది..?

MOHAN BABU
పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్. దేశం స్థితిగతులనే మార్చ పోతుందా అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే అదే జరుగబోతుంది. ఇండియా అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని పేరు. తరతరాలుగా ఇదే మాట వినిపిస్తోంది. అభివృద్ధి చెందిన జాబితాలోకి మాత్రం వెళ్లలేదు. అయితే ఇప్పుడు ఒక్క పథకం మొత్తం  దేశం రూపురేఖలనే మార్చబోతుందా. ప్రతి ఒక్కరి తలరాతను,భవిష్యత్తును డిసైడ్ చేయబోతోందా. దేశంలో మల్టీమోడల్ కనెక్టివిటీ కోసం  పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ద్వారా శ్రీకారం చుట్టబోతున్నారు. గతిశక్తి సమూలంగా మార్చేస్తుంది. ఇది మన ప్రధాని విశ్వాసం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 100 లక్షల కోట్లు అంటే కోటి కోట్లతో ప్రతిష్ఠాత్మక పథకాన్ని మోడీ ప్రకటించారు.

 మౌలిక రంగంలో సమూల మార్పులు చేసి శాఖల మధ్య సమన్వయంతో గట్టి శక్తిని చేపట్టనున్నారు. ఈ పనులను 2024 -25 సరికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనుమతుల్లో ఆలస్యం నివారించి మౌలిక వసతుల నిర్మాణాన్ని సంపూర్ణంగా వేగంగా కొనసాగించడానికి గతి శక్తి కార్యక్రమాన్ని చేపడతారు. భారత  వ్యాపారరంగం లో పోటీతత్వం పెంచడంతో పాటు టెక్స్ టైల్, ఫార్మాస్యూటికల్ క్లస్టర్, డిఫెన్స్ కారిడార్, ఎలక్ట్రానిక్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్, ఫిషింగ్ క్లాస్టర్స్, అగ్రిజోన్స్ అనుసంధానం చేస్తారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెంచడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు గతిశక్తి ఉపయోగపడనుంది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా రెండు లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజా రవాణా తో పాటు, సరకు రవాణా సాఫీగా సాగుతుంది. చివరి మైలు వరకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గుతుంది. రహదారులే దేశ అభివృద్ధికి దారి చూపిస్తాయని చరిత్ర చెబుతుంది. అభివృద్ధి ప్రణాళికలు ఎప్పుడు రోడ్ల నుంచే ప్రారంభమవుతాయి. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తారు.

దేశంలోని అన్ని గ్రామాలకు 4జి నెట్వర్క్. 220 ఎయిర్ పోర్టులు, హెలిపోర్ట్ ల నిర్మాణం. అదనంగా 17 వేల కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్.హార్బర్ లు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా 38 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు 109 ఫార్మా క్లస్టర్లు. అయితే ఈ అద్భుతం సాకారం కావాలంటే అన్ని విషయాల్లో మనం ప్రిపేర్ అయ్యి  ఉండాలన్నది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: