కేటీఆర్ విష‌యంలో క‌న్ఫ్యూజ్ అవుతున్న నేత‌లు..!

Paloji Vinay
హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో మంత్రి కేటీఆర్ పేరు కూడా చేర్చిన సంగ‌తి విధిత‌మే. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారానికి కేటీఆర్ వెళ్తారా లేదా అనే సందేహం ఆ పార్టీ నేత‌ల్లో మొద‌ల‌యిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌చారానికి వెళ్తే ఓట‌ర్ల మ‌న‌సు గెలుచుకోవ‌చ్చిన విజ‌యం సుల‌భం అవుతుంద‌ని కారు పార్టీ నాయ‌కులు అనుకుంటున్నారు. అయితే, ప్ర‌చారానికి ఇంకా 13 రోజులే స‌మయం ఉండ‌డంతో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌పై ఇంకా క్లారిటీ రావ‌డం లేద‌ని తెలుస్తోంది.

 
  ఇక ఉప ఎన్నిక‌ల‌పై రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్ని త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపాయి. దీంతో నువ్వా నేనా అన్న‌ట్టుగా హుజురా`వార్‌` సాగుతోంది. త‌మ ప్ర‌భుత్వాలు  చేప‌డుతున్న ప‌థ‌కాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను, అభివృద్దిని వివ‌రించి చెబుతున్నారు ఓట‌ర్ల‌కు. గ‌డ‌ప‌గ‌డ‌కు వెళ్లి ప్ర‌చారం చేస్తూ త‌మ పార్టీకే ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. అంతే కాదు.. ప్ర‌జ‌ల నాడీ తెలుసుకునేందుకు గెలుపోట‌ముల‌ను భేరీజు వేసేందుకు సర్వేలు కూడా చేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. వాటికి అనుగుణంగా కార్య‌క్ర‌మాలు రూపొందించుకుంటు ముందుకు వెళ్తున్నారు.

 
 అయితే, టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి గెలుపు కోసం మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర‌క‌మిటీ నాయ‌కులు విస్తృతంగా ప్ర‌చారం చేస్తు పార్టీ అభివృద్ధి ప‌నుల‌ను వివ‌రిస్తున్నారు. అయితే, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ప్ర‌చారం చేస్తే ఓట‌ర్లు కొంత వ‌ర‌కు టీఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీని ద్వారా గెల్లు శ్రీ‌నివాస్ గెలుపు త‌థ్యమ‌వుతుంద‌ని కేటీఆర్ ను ప్ర‌చారానికి రావాల‌ని ఇప్ప‌టికే పార్టీ నేత‌లు మంత్రి కేటీఆర్‌ను కోరారు. అయితే, హుజురాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తారా  వెళ్తే అక్క‌డ ప‌రిస్థితుల్లో ఎలాంటి మార్పులు వ‌స్తాయి.. టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవ‌కాశాలు ఏ మేర‌కు ఉంటాయి అనే విష‌యం చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: