దేవుడా..! తిరుమల పూజల్లో అసలేం జరుగుతోంది..?

Chakravarthi Kalyan
తిరుమల తిరుపతి.. దేశంలోనే  పేరున్న దేవస్థానం. ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా దేశమంతా భక్తితో కొలిచే బాలాజీ కొలువున్న ఆలయం. అయితే ఇటీవల ఆ ఆలయంలో పూజలు, కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కొందరైతే కోర్టులకూ వెళ్లారు. అయితే.. ఈ ఆరోపణలను టీటీటీ ఖండిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో అంతా సక్రమంగానే జరుగుతోందని వివరణ ఇచ్చింది.

టీటీడీ ఏం చెబుతోందంటే.. పెద్ద జీయంగార్, చిన జీయంగార్‌లు పాటిస్తూ అభిషేకాలు నిర్వహిస్తున్నారు.. ఆర్జిత బ్రహ్మోత్సవ వేళల్లో శ్రీవారిని మాడ వీధుల్లో ఊరేగించడం లేదని పిటిషనర్‌ చేసిన మరో ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ప్రజల కోసం టీటీడీ ప్రవేశపెట్టింది.. గరుడ, హనుమంత, శేష వాహనాలపై స్వామి వారిని కూర్చొపెట్టి ఎలాంటి ఊరేగింపు లేకుండా భక్తులకు దర్శనమిచ్చే విధంగా రూపొందించామని టీటీడీ తెలిపింది.

ఇంకా టీటీడీ ఏం చెప్పిందంటే.. “ వార్షిక బ్రహ్మోత్సవం, నాగపంచమి, గరుడ పంచమి వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే శ్రీవారు మాడ వీధుల్లో ఊరేగుతారు.. స్వామి వారి దర్శనం అనేది వైఖానస ఆగమ శాస్త్రంలో సేవ గా కానీ.. ఉత్సవంగా పేర్కొనలేదు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని టీటీడీ పాలక మండలి దర్శనాలు కల్పిస్తోంది. సగటున రోజుకి లక్ష మందికి పైగా భక్తులు దర్శనానికి వస్తారని టీటీడీ వివరించింది.

ప్రతి ఒక్కరినీ కులశేఖరపడి వరకూ దర్శనానికి అనుమతిస్తే రోజుకి కేవలం 9వేల మందికి మాత్రమే దర్శనం కల్పించగలుగుతామని టీటీడీ తన అఫిడవిట్‌లో చెప్పింది. అందుకే గంటకు 800 మందికి దర్శనం కల్పించాల్సి ఉంటుందని వివరించింది. మహా లఘు దర్శనం సమయంలో గంటకు సుమారు 5000 మంది యాత్రికులకు దర్శనం కల్పించవచ్చని టీటీడీ వివరించింది. దీంతో రోజులో దాదాపు 80,000 నుండి 90,000 మంది భక్తులు దర్శనం పొందుతారని దేవస్థానం వివరించింది. భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తి చేసుకోవాలని భావిస్తారన్న టీటీడీ ఇబ్బందులు లేకుండా శ్రీవారిని భక్తులు దర్శించుకోవడానికి సౌకర్యాలు కల్పించడమే టీడీటీ ప్రధమ కర్తవ్యం అని  తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: