క్షిపణి తయారీలో.. కొరియాల పోటీ..!

Chandrasekhar Reddy
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఒకప్పటి దోస్తానాలు, ఇప్పుడు బద్ద శత్రువులు. మహానుభావులు ఎవరు విడదీశారో ఇంత ఘాటుగా కానీ, ఇప్పటికి వీళ్ళ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె మండిపోయేట్టుగానే ఉంటున్నారు. కిమ్ అంటేనే ఆయుధాల సంపత్తి నడిచి వస్తున్నట్టే ఉంటుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు మరియు దక్షిణ కొరియా అధ్యక్షులు ఇటీవల క్షిపణుల తయారీ కోసం పోటీపడుతున్నారు. ఇష్టానుసారంగా క్షిపణులు తయారుచేస్తున్నందుకు ఉత్తరకొరియా ఆంక్షలు కూడా ఎదుర్కొంది. అయితే సియోల్ పై సుదీర్ఘకాలంగా ఉన్న ఆంక్షలు తీసేయడంతో దక్షిణ కొరియా కూడా తమ సొంత క్షిపణుల తయారీకి రంగం సిద్ధం చేసుకుంది.
ప్రస్తుతం కొరియాలు తమ క్షిపణి ఉత్పత్తిలోనే ప్రధానంగా ద్రుష్టి పెట్టినట్టే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఒకపక్క వీరిద్దలు చర్చలు జరుపుకుంటూనే మరోపక్క ఆయుధ సంపత్తిపై దృష్టిపెట్టడం ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. కానీ ఈ కోణం వారి మధ్య జరుగుతున్న చర్చలపై ప్రతికూలతను పెంచుతుంది. గతనెల రెండో వారంలో ఉత్తర కొరియా సుదీర్ఘ క్రూయిజ్ క్షిపణుల పరీక్ష చేసినట్టు మీడియా ప్రకటించింది. ఇవి 1500 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవని మీడియా తెలిపింది. అనంతరమే మరో క్షిపణి ప్రయోగం కూడా ఉత్తర కొరియా చేపట్టినట్టు మీడియా తెలిపింది. అది ఒక రైలు ను మార్పులు చేర్పులు చేసి బర్న్ మిసైల్ అంటూ ప్రయోగించినట్టు తెలిపింది. దీనిని దక్షిణ కొరియా బాలిస్టిక్ క్షిపణి అని వివరించింది. ఇవి దాదాపు 800 కి.మీ. ప్రయాణించగలవు.
ఇలా ఉత్తర కొరియా అనేక క్షిపణుల ప్రయోగాలు చేస్తుంటే, దక్షిణ కొరియా కూడా స్వదేశీ క్షిపణులను రూపుదిద్దటంలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియా జలాంతర్గామి నుండి బాలిస్టిక్ క్షిపణి ఒకటి ప్రయోగించింది. దానికి హ్యూన్ మూ 4-4 అనే పేరు పెట్టారు. ఇది 500 కి.మీ. వరకు లక్ష్యాలను ఛేదించగలదు. 2024 నాటికి అంతరిక్షంలోకి పంపాలనుకున్న రాకెట్ ను కూడా వాళ్ళు పరీక్షించారు. ఇద్దరి కొరియన్ ల బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ వారు  పెడితే అది ప్రపంచ యుద్ధంగా మాత్రం పరిణమించే అవకాశాలు  ఎవరైనా యుద్ధం ప్రారంభిస్తే .. అని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొరియాలు ప్రారంభిస్తే వాళ్ళు మధ్యలో సందర్భాన్ని వాళ్లకు అనుకూలంగా వాడుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: