ష‌ర్మిల ప్ర‌ణాళిక‌లు తెలంగాణ లో వ‌ర్క్ అవుట్ అవ‌డం లేదా?

Dabbeda Mohan Babu
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ ష‌ర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని స్థాపించి తెలంగాణ లో ప‌ట్టు సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే తెలంగాణ లో వైఎస్ ఆర్ రాజ్యం తీసుకురావాల‌నే ఉద్ధేశం తోనే తాను పార్టీ స్థాపించిన‌ట్టు ప‌లు మార్లు ప్ర‌క‌టించింది. తెలంగాణ లో వైఎస్ ఆర్ పాల‌న కు చాలా మంది అభిమానులు ఉన్నార‌ని వారి మ‌ద్ధ‌త్తు త‌న‌కు త‌ప్ప‌క కుండా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అలాగే మిగితా ప్ర‌జ‌ల‌ను తన వైపు న‌కు ఆక‌ర్షించ‌డానికి వైఎస్ ష‌ర్మిల విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు న‌కు తిప్పు కోవ‌డానికి అనేక ప్ర‌ణాళిక ల‌ను రచిస్తుంది. ఎలాగైనా తెలంగాణ లో ఉన్న అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను త‌న పార్టీ వైపు తిప్పుకుని రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్టాల‌ని చూస్తుంది.


అయితే రాష్ట్రంలో వివిధ రకాల వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టు కోవ‌డానికి ష‌ర్మిల చేస్తున్న ప్ర‌యోగాలు అంత స‌ఫ‌లం అవుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ముందుగా ద‌ళితులు స‌మ‌స్య ల‌పై మాట్లాడి ఆ వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఆకట్టు కోవాల‌ని  విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. అందు కోసం ప్ర‌త్యే కంగా ప‌లు ప్ర‌ణాళిక ల‌ను కూడా త‌యారు చేసింది. కానీ అవి ఆశించిన మేర ఫ‌లితాలు రాబ‌ట్ట లేక పోయాయి. దీని త‌ర్వాత మ‌హిళా స‌మ‌స్య ల పై ఫోక‌స్ చేశారు. అది కూడా నిరుత్స‌హ ప‌రిచింది అనే చెప్పాలి. దీంతో రాష్ట్రంలో ప్ర‌ధానంగా ఉన్న నిరుద్యోగ స‌మ‌స్య ను వెలికి తీసింది. నిరుద్యోగుల పై ప‌ట్టు సాధించి వారి మ‌న్న‌నులు పొందాల‌ని చూస్తుంది. అందు కోసం దాదాపు అన్ని జిల్లాల పై ప‌ర్య‌టించి నిరుద్యోగ నిర‌హార దీక్ష ల‌ను చేస్తుంది. అయితే వీటికి పెద్ద‌గా స్పంధ‌న రావ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో  సీట్ల న్నీ కూడా త‌మ పార్టీ త‌రుపున  నిరుద్యోగు ల‌కే కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌య‌త్నం అయినా ష‌ర్మిల కు క‌లిసి వ‌స్తుందో లేదో చూడాలి మ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: