నిరుద్యోగుల‌ను రాజకీయ నిరుద్యోగులు వాడుకుంటున్నారా?

Dabbeda Mohan Babu
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కు నిరుద్యోగులు పెరుగుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య కాలంలో ఎలాంటి ఉద్యోగ నోటిఫికేష‌న్ లు విడుద‌ల చేయడం లేదు. అందు చేత రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఏడాది ఏడాది కి నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా ఈ మ‌ధ్య కాలం లో వచ్చిన కరోన వైర‌స్ వ్యాప్తి పెర‌గ‌డం తో రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్ట‌డం తో చాలా మంది యువ‌కులు ఉద్యోగాల‌ను కొల్పోయారు. దీంతో నిరుద్యోగుల సంఖ్య వివ‌రీతం గా పెరిగి పోయింది. అయితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ స‌మ‌స్య ను రాజ‌కీయ నాయ‌కులు క్యాచ్ చేసుకుని లాభ పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. నిరుద్యోగ స‌మస్య ను వాడుకుని త‌మ రాజ‌కీయ నిరుద్యోగాన్ని వ‌దిలిచు కోవాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇదీల ఉండ‌గా తెలంగాణ లో వైఎస్ ఆర్ కుమార్తే వైఎస్ ష‌ర్మిల నూత‌నంగా వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అనే రాజ‌కీయ పార్టీ ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ లో ఏ విధంగా నైనా పాగ వేయాల‌ని ష‌ర్మిల విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ లో ప్ర‌ధానంగా ఉన్న నిరుద్యోగ స‌మ‌స్య పై ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. తెలంగాణ లో ఉన్న నిరుద్యోగుల ద్వారా త‌న రాజ‌కీయ నిరుద్యోగాన్ని అధిగ మించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. నిరుద్యోగ స‌మ‌స్య పై ఆందోళ‌న లు చేసి తెలంగాణ ప్ర‌జ‌ల దృష్టి ఆకార్షించాల‌ని చూస్తోంది. అందులో భాగం గానే త‌మ పార్టీ నుంచి నిరుద్యోగు ల‌ను  రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ లో ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ ప్ర‌య‌త్నం ష‌ర్మిల కు ఏ విధంగా క‌లిసి వ‌స్తుందో చూడాలి. అలాగే ష‌ర్మిల కు ముందే నిరుద్యోగ స‌మ‌స్య‌ను లేవ‌నెత్తాల‌ని టీ కాంగ్రెస్ కూడా భావించింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగ సైర‌న్ అనే పేరు మీద ఆందోళ‌న‌లు కూడా చేసింది. అయితే త‌మ‌ను రాజ‌కీయ నాయ‌కులు త‌మ అవ‌స‌రాల‌కు వాడు కుంటున్నారు కానీ త‌మ ఎలాంటి లాభం ఉండ‌ద‌ని నిరుద్యోగులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: