అమెరికాలో.. లక్షల మందిని చంపేస్తున్న కెమికల్..?

Chakravarthi Kalyan
ఇప్పుడు ఏ వస్తువు తయారు చేసినా అందులో అనేక రసాయనాల వాడకం సర్వసాధారణమైపోయింది. కానీ.. ఆ రసాయనాల్లో కొన్ని మనుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని రసాయనాలు ఏకంగా లక్షల మంది మరణానికి కారణం అవుతున్నాయి. అలాంటి ఓ రసాయనాన్ని అమెరికాలో గుర్తించారు. అక్కడ నిత్యావసర వస్తువుల తయారీలో సర్వసాధారణంగా ఉపయోగించే థాలెట్స్‌ అనే కెమికల్స్ చాలా ప్రమాదకరంగా  మారుతున్నాయట.

ఈ థాలెట్స్  రసాయనాల వల్ల అమెరికాలో ప్రతి ఏడాదీ  లక్ష మరణాలు చోటుచేసుకుంటున్నాయ. న్యూయార్క్‌ యూనివర్శిటీ తాజాగా చేసిన ఓ స్టడీలో ఈ విషయం తేలింది. ఈ థాలెట్స్.. పిల్లల బొమ్మల నుంచి దుస్తులు, షాంపూల వరకు నిత్య జీవితంలో ఉపయోగించే అనేక ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో  వాడతారు. ఈ థాలెట్స్‌ ఆ వస్తువుల నుంచిమన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయట. ఇవి  హార్మోన్లు, ఎండోక్రైన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయట.

న్యూయార్క్‌ యూనివర్శిటీ ఇటీవల 55 నుంచి 64ఏళ్ల మధ్య వయసు గల 5 వేల మందిపై పరిశోధనలు నిర్వహించింది. వీరి  మూత్రంలో అత్యధిక మోతాదులో థాలెట్స్‌ రసాయనాలు ఉన్నట్లు  పరిశోధనలో తేలింది. అంతే కాదు.. ఈ రసాయనాల వల్ల వీరంతా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే ప్రమాదం కూడా ఉందట. అయితే థాలెట్స్‌ రసాయనాల వల్ల మనిషి ప్రాణాలు నేరుగా పోవు. ఈ రసాయనాల వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు బాగా పెరుగుతుంది.

ఈ గుండె సమస్యలు మరణాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ థాలెట్స్‌  ఊహించినదాని కంటే చాలా ప్రమాదకరమైనవట.  ఈ థాలెట్స్‌ వల్ల అమెరికాలో చాలా మంది అనేక వ్యాధుల బారినపడుతున్నారట.  ఏడాదికి లక్ష మరణాలు చోటుచేసుకుంటున్నాయని ఈ స్టడీ తేల్చింది. అంతే కాదు.. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి తగ్గే అవకాశం కూడా ఉందట. అందుకే జర జాగ్రత్త. అందుకే రసాయనాల వినియోగంతో జాగ్రత్త. పిల్లలకు బొమ్మలు కొనిచ్చేటప్పుడు జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: