పార్టీ ఆఫీస్ లు మూసేద్దాం: వైసీపీకి బిజెపి సవాల్...?

Sahithya
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి వైసీపీ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిప్యూటి సిఎం అంజాద్ బాషా లు బిజెపి, కాంగ్రెస్ అడ్రస్ లేదని వ్యాఖ్యనించారు అంటూ... బిజెపిని చూసి వణికిపోతున్నందుకే బద్వేలుకి ఇంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు అని అన్నారు. బిజెపి వైసిపికి పార్టీకి సవాల్ అని... ఈనెల 29వ తేదీ వరకు బద్వేలులో పార్టీ కార్యాలయాలను మూసి వేద్దామా అంటూ సవాల్ చేసారు. బద్వేల్ లో కూడా పాత పట్నం చరిత్రపునరావృతం అవుతుంది అని పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగం చేయకుండా మా సవాల్ను స్వీకరిస్తారా అని నిలదీశారు. బద్వేల్ కి మీరు ఏమి చేశారని ప్రజలు మీకు ఓటు వేయాలి అని నిలదీశారు. ఒక డిగ్రీ కాలేజ్ లేదు... జూనియర్ కాలేజ్ లేదు బద్వేల్ ను ఎందుకు నిర్లక్షం చేశారు అని ప్రశ్నించారు. 30లక్షల ఇళ్లు 3.5 లక్షల పెషన్స్ రద్దు చేసారు అని ఇసుకమద్యం ధరలు పెంచి ప్రజలకు అన్యాయం చేసారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసి మతాల మధ్య చిచ్చు అని విమర్శలు చేసారు. రోడ్లు మరమత్తులు లేవు,కొత్త రోడ్లు లేవు అని అన్నారు.
కేంద్ర నిధులు దారి మల్లిస్తున్నారు అంటూ విమర్శలు చేసారు. బద్వేల్ చుట్టూ వైసిపి నాయకులు పేదల భూముల కబ్జా చేస్తున్నారు అని అన్నారు. మీరే కోర్టులో కేసులు వేసుకుని ప్రతి పక్షాలపై నెట్టడం జరిగింది అని అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బిజెపి జనసేన సత్తా చూపిస్తాం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీకి ప్రత్యర్ధిగా బిజెపి పోటీ లో ఉంది. సాంప్రదాయాలను గౌరవిస్తూ టీడీపీ పోటీ చేయడానికి ఆసక్తి చూపించలేదు. అటు జనసేన పార్టీ కూడా ఈ ఎన్నిక కోసం దూరంగా నిలవడం తో తప్పని పరిస్థితిలో బిజెపి పోటీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: