ఉత్త‌ర‌ఖండ్ బీజేపీ కి షాక్ ! పార్టీ మారిన మంత్రి

Dabbeda Mohan Babu
ఉత్త‌ర ఖండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజు కోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఆ రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది లో జ‌ర‌గ బోయే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల హ‌స్తం జెండా ఎగువ వేయాల‌ని శ‌త విధాలుగా ప్ర‌యత్నాలు చేస్తూ ఉంది. ఉత్త‌ర ఖండ్ రాష్ట్రంలో గ‌తంలో 2017 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ యే అధికారం లో ఉండేది. కానీ 2017 సంవత్స‌రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ మెజార్టీ స్థానాల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్ప‌టి నుంచి కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో రోజు రోజు కు ఉనికి త‌గ్గి పోతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగం లోకి దికి ప‌రిస్థితి ని చ‌క్క దిద్దే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అయితే బీజేపీ కూడా ఉత్త‌ర ఖండ్ లో త‌మ ప‌ట్టు ను ఏమాత్రం వ‌ద‌ల కుండ జ‌గ్ర‌త్త ప‌డుతూ వ‌స్తుంది.

అయితే ఉత్త‌ర ఖండ్ లో అధికారం లో ఉన్న బీజేపీ కి ఆ పార్టీ మంత్రి షాక్ ఇచ్చాడు. ఉత్త‌ర ఖండ్ రాష్ట్ర ప్ర‌భుత్వంలో ర‌వాణా శాఖ మంత్రి ప‌ద‌వి భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్న య‌శ్ పాల్ ఆర్య త‌న ప‌ద‌వి రాజానామా చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. అలాగే య‌శ్ పాల్ ఆర్య కుమారుడు నైనిటాల్ అసెంబ్లి నియోజ‌క వ‌ర్గం ఎమ్మెల్యే సంజీవ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే య‌శ్ పాల్ ఆర్య గ‌తంలో కూడా కాంగ్రెస్ పార్టీ కే ప్రాతినిథ్యం వ‌హించే వాడు. అంతే కాకుండా 2007 నుంచి 2014 వ‌ర‌కు ఉత్త‌ర ఖండ్ కాంగ్రెస్ పార్టీ కి చీఫ్ గా కూడా ఉన్నారు. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లి ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. అయితే య‌శ్ పాల్ కాంగ్రెస్ లో చేర‌డం పై ఉత్త‌ర ఖండ్ కాంగ్రెస్ ముఖ్య నాయ‌కులు హ‌రీష్ రావ‌త్, ర‌ణ‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణు గోపాల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే సంవ‌త్స‌రం రాబోతున్న జన‌ర‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని దీమ వ్య‌క్తం చేశారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: