జ‌గన్‌పై కొడాలికి కాన్ఫిడెన్స్ మ‌రీ ఓవ‌ర్ అయిపోయిందా ?

VUYYURU SUBHASH
సాధారణంగా నాయకులు...తమ అధినేతలకు భజన బాగా చేస్తుంటారు...పదవుల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా తమ అధినేతలని పొగుడుతారు. అయితే పొగడ్తలతో లిమిట్ గా ఉంటే బాగుటుంది...అలా కాకుండా ఓవర్ అయితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మంత్రి కొడాలి నాని వర్షన్ కూడా అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని ఏ విధంగా....జగన్ కోసం నిలబడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అసలు జగన్‌పైన ఎవరైనా విమర్శలు చేస్తే అసలు ఊరుకోరు....వెంటనే మీడియా ముందుకొచ్చేసి వారిపై ఫైర్ అవుతారు. టి‌డి‌పి అధినేత చంద్రబాబు మీద అయితే ఒంటికాలి మీద వెళ్తారు. ఇక ఆయనపై కొడాలి ఎలాంటి విమర్శలు చేస్తారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కొడాలి....పవన్-చంద్రబాబులని కలిసి తిడుతున్నారు. తాజాగా వారిపై విమర్శలు చేశారు...బాబు-పవన్‌లు ఎన్ని కుట్రలు చేసినా సరే జగన్‌ని ఏం చేయలేరని, జీవితాంతం జగనే సి‌ఎంగా ఉంటారని కొడాలి అన్నారు.

చంద్రబాబు-పవన్‌లు కలిసొచ్చినా సరే జగన్‌ని ఓడించలేరని మాట్లాడుతున్నారు. అయితే మామూలుగా తమ నాయకుడుని ఓడించలేరని చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జీవితాంతం జగనే సి‌ఎంగా ఉంటారనడమే కాస్త అతిశయోక్తిగా ఉందని చెప్పొచ్చు. అంటే జీవితాంతం అంటే....వయసు అయిపోయే వరకు జగనే సి‌ఎంగా ఉంటారని కొడాలి చెబుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ పరిస్తితి ఉంటుందా? అంటే అదంతా జనం చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు.

ఇప్పటికే జగన్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుస్తోంది. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మెరుగైన పనితీరు కనబర్చడం లేదు. ఇలాంటి పరిస్తితుల్లో నెక్స్ట్ ఎన్నికల్లోనే పరిస్తితి ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదు. ప్రస్తుతానికైతే టి‌డి‌పికైతే బాగా బలం లేదనే చెప్పొచ్చు. అలా అని ఆ పార్టీని తక్కువ అంచనా వేయకూడదు.. ఇక టి‌డి‌పి-జనసేనలు కలిస్తే వైసీపీకే నష్టమే తప్ప లాభం జరగదని బాగా అర్ధమవుతుంది. మరి ఇలా పరిస్తితులు ఉన్నా సరే కొడాలి కాన్ఫిడెంట్‌గా జీవితాంతం జగనే సి‌ఎంగా ఉంటారని ఎలా చెబుతున్నారో ఆయనకే తెలియాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: