పెళ్లి చూపులకు వెళితే.. ప్రాణం పోయింది?

praveen
మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని చెబుతూ ఉంటారు.  అందుకే సంతోషంగా గడుపుతున్న సమయంలోనే ఊహించని విధంగా విషాద ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఏ క్షణంలో ఎటువైపు నుంచి మృత్యువు వచ్చి కబలిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది.  అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని ఘటన అందరిని ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెడుతూ ఉంటుంది. ఆనందంగా ఉన్నాము అనుకున్న సమయంలో నిమిషాల్లో విషాదం నిండి పోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

 ఆ యువకుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో ఇద్దరితో కలిసి పెళ్లి చూపులకు వెళ్ళాడు.  పెళ్లిచూపులు జరిగాయి ఇక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతని ఆనందాన్ని విధి చిన్నచూపు చూసింది. చివరికి రోడ్డు ప్రమాదం రూపంలో  మృత్యువు అతని కబలించింది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన సూరిబాబు పెళ్లి చూపుల కోసం బంధువులతో కలిసి రాజమహేంద్రవరం వెళ్ళాడు.

 అక్కడ పెళ్లిచూపులు పూర్తి చేసుకుని అదే కారులో మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారూ. కానీ వారికోసం రోడ్డు ప్రమాదం అనే  మృత్యువు వేచి చూస్తుంది అన్నది మాత్రం ఊహించలేకపోయారు. ఇంటికి తిరుగు ప్రయాణం ఆయన సమయంలో అనంతపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న గోవిందరావు కారు డ్రైవర్ శివాజీ అక్కడికక్కడే మృతి చెందారు. ఇకతీవ్ర గాయాలపాలైన సూరిబాబు ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: