హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా..కాంగ్రెస్ అంతేనా..?

MOHAN BABU
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ టిఆర్ఎస్, బిజెపి మధ్యనే అని తేలిపోయింది . టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా ఈ విషయం చెప్పినట్లే కనిపిస్తుంది. మొదటి నుంచి హుజురాబాద్ ఉప ఎన్నిక పై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ రేసులో లేదని అర్ధమైపోతుంది. ఈటెల రాజేందర్ ఎఫెక్ట్ తో ఉపఎన్నిక  పోరు మారిపోయింది. ఈటెల, టిఆర్ఎస్ ల మద్యే ఫైట్  జరుగుతుందని జనమంతా అనుకుంటున్నారు. ఇక ఆ విషయాన్ని రేవంత్ కూడా పరోక్షంగా  అంగీకరించి ఉప ఎన్నిక పై ఫోకస్ పెట్టలేదు. అందుకే బలమైన అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని ప్రచారం కూడా  నడుస్తోంది. కాకపోతే అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి  ప్రచారం  చేయడానికి మాత్రం రేవంత్ సిద్ధమవుతున్నాడు. అయితే తాజాగా కూడా ఉపఎన్నిక గురించి రేవంత్ కామెంట్ చేశాడు.

 టిఆర్ఎస్, బీజేపీలు ఒకటే అన్న కోణంలో ప్రచారం చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే అని మాట్లాడారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదమని తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదమని అన్నారు. ఇక్కడ హరీష్ బకరా అంటే హుజురాబాద్ లో గెలుపు కష్టమనే చెప్పి కేసీఆర్ హరీష్ కు బాధ్యతలు అప్పగించారని చెప్పొచ్చు. అక్కడ హరీష్ కే నెగెటివ్ అవుతుంది. అప్పుడు కేటీఆర్ ని సీఎం చేయడానికి  ఇంకా సులువవుతుంది. ఇటు ఈటెల గెలిస్తే బండికి, కిషన్ రెడ్డికి ఇబ్బందని అంటున్నారు. అంటే పరోక్షంగా ఈటెల గెలవబోతున్నాడని రేవంత్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

లేకపోతే ఈటెల గెలిస్తే ఇద్దరికీ ప్రమాదం అని చెప్పాల్సిన అవసరం ఏముంది. అయితే టిఆర్ఎస్, బిజెపి ల గురించి మాట్లాడుతున్నారు కానీ కచ్చితంగా హుజురాబాదులో కాంగ్రెస్ గెలుస్తుందని మాత్రం రేవంత్ మాట్లాడడం లేదు. మొదటి నుంచి రేవంత్ అదే వైఖరితో  ఉన్నారు.అందుకే కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడడం లేదు. కాకపోతే ఇక్కడ రేవంత్ టార్గెట్ కాంగ్రెస్ గెలవడం కాదు టిఆర్ఎస్ ఓడిపోవడం అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: