మా పోరు : రోజా మేడ‌మ్ ఏంటా స‌మాధానం?

RATNA KISHORE

శుభ్ర‌మ‌యిన దారిలో న‌డ‌వ‌డం శ్రేష్టం అని నిర్ణ‌యించుకున్న కొంద‌రు న‌టీ న‌టుల‌లో రోజా ఒక‌రు అని తేలిపోయింది. అందుకే త‌న‌ను  ఏ వివాదాల‌కు సంబంధించి ప్ర‌శ్న‌లు అడ‌గ‌వ‌ద్దు అని విన్న‌విస్తూ త‌ప్పుకోవ‌డం అంటే ఆమె ఇప్ప‌టికిప్పుడు నేర్చుకున్న విద్య ఇదేనా అని నిర్ణ‌యించుకోవాలి. రాజకీయంగానూ ఆమె పెద్ద‌గా రాణిస్తున్న‌ది లేదు క‌నుక ఎందుకు మ‌రొక త‌ల‌నొప్పి త‌న‌కు అన్న విధంగానే ఆమె స్పందిస్తున్నారు మా వివాదాల‌పై! బాగుంది న‌టీన‌టుల మేలుకు మా అసోసియేష‌న్ మాత్ర‌మే కాదు రోజా లాంటి దిగ్గ‌జ న‌టులు కూడా ప‌ని చేయొచ్చు. త‌ప్పేం కాదు అందులో త‌ప్పేమీ లేదు. ఆ ప‌ని మా అసోసియేష‌న్ కాకుండా రోజా కూడా చేస్తే ఇంకా బాగుంటుంది కూడా!

చాలా రోజుల త‌రువాత మా గొడ‌వ‌ల్లో త‌నను ఇరికించకండి అని వేడుకుంటున్నారు రోజా సెల్వ‌మ‌ణి.. అవును! ఆమె చెప్పిన మాట ప్ర‌కారం అన‌వ‌స‌ర వాగ్వాదాలు వ‌ద్ద‌నుకుని తీరడం మంచిదే కానీ డిప్ల‌మాటిక్ ఆన్స‌ర్స్ ఇస్తే,  దాని వ‌ల్ల ఎవ‌రికి లాభం?చాలా రోజులుగా ఇండ‌స్ట్రీకి దూరంగానే ఉంటున్నారు రోజా. టెలివిజ‌న్ మాధ్య‌మాల్లో త‌ప్ప బిగ్ స్క్రీన్ పై ఆమె న‌టిస్తుంది లేదు.కానీ కొన్ని వివాదాల్లో మాత్రం ఆమె స్పందించారు కూడా గ‌తంలో! ఇప్పుడు మాత్రం వివాదాలంటే భ‌య‌ప‌డిపోతున్నారు. త్వ‌ర‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నార‌న్న వార్త‌లూ ఉన్నాయి అందుకే ఆమె జాగ్ర‌త్త వ‌హిస్తున్నార‌ని మ‌రో టాక్.
వివాదాల్లో దూర‌ను.న‌న్ను లాగొద్దు. అంటూ రోజా మేడ‌మ్ స్పందించారు మా గొడ‌వ‌ల‌పై..లోక‌ల్ అండ్ నాన్ లోక‌ల్ ఇష్యూస్ పై..ఎన్న‌డూ లేనిది తాను ఎటు ఉంటానో అన్న‌ది కూడా స్ప‌ష్టం చేయ‌లేదు..రోజా మేడ‌మ్. అంటే ఎందుకు వ‌చ్చిన గొడ‌వ‌లు అని ఆమె కూడా ఫిక్స్ అయిపోయారా.. క‌ళాకారులకు ఎవ‌రు ఎక్కువ మేలు చేస్తే అటే ఉంటాన‌ని అంటున్నారు..మంచిదే! ఆ మాట కూడా ఎందుకంత న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పడం. అంటే కాంఫ్లిక్ట్ ను స్కిప్ చేయ‌డంలో ఉన్న తెలివిని రోజా ప్ర‌ద‌ర్శిస్తున్నారా ఏంటి?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: