చైనా వద్దు.. భారత్ ముద్దు.. డ్రాగన్ కి షాకిచ్చిన దేశం?

praveen
చైనా అంటేనే నాసిరకం వస్తువులకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఇతర దేశాలు తయారు చేసిన వస్తువులు నమూనాలను దొంగలించి డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తూ ఉంటుంది చైనా. అంతేకాకుండా ప్రతి వస్తువు నాసిరకంగా తయారు చేస్తూ ఉంటుంది. అందుకే అన్ని దేశాల కంటే చైనాకు చెందిన అన్ని రకాల వస్తువులు ధరలు కూడా తక్కువగా ఉంటాయ్.  అందుకే ఎవరైనా సరే చైనా కు సంబంధించిన బ్రాండ్ అనగానే కొనుగోలు చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారు. మొన్నటి వరకు నాసిరకంగా వస్తువులు తయారు  చేసిన చైనా ఇక ఇప్పుడు ఎరువుల ఈ విషయంలో కూడా ఇలాంటిదే చేస్తున్నట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతం చైనా ఎన్నో దేశాలకు ఎరువుల ఎగుమతులను చేస్తుంది. ఇలా చైనా ఎగుమతులు చేస్తూ ఉన్న దేశాలలో శ్రీలంక కూడా ఒకటి. ఆర్థిక సహాయం పేరుతో శ్రీలంకను మొదట ఆదుకున్నట్లుగా నాటకం ఆడిన చైనా చివరికి ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో శ్రీలంకకు చెందిన కొన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుంది.  ఇక ఎప్పుడూ శ్రీలంక కు ఎన్నో ఎగుమతులను కూడా చేస్తుంది చైనా. ఈ క్రమంలోనే ఇటీవల పంప ఎరువులను చైనా నుంచి శ్రీలంక దిగుమతి చేసుకుంది.  కానీ ఎరువుల లో ఎరువుల కంటే ఎక్కువగా ఇసుక ఉందని గ్రహించింది శ్రీలంక.  ఇలాంటి ఎరువులు వాడితే పంట నష్టం తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదని భావించింది.

 హైదరాబాద్ లోనే ఏకంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఎరువులను మళ్ళీ తిరిగి పంపించేసింది.  ఇక ఇప్పుడు నాణ్యమైన ఎరువుల కోసం  భారత ఆశ్రయించింది శ్రీలంక. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఎందుకంటే శ్రీలంకలో వ్యవసాయమే ప్రధాన ఆదాయం. కానీ ఇటీవల కాలంలో మాత్రం శ్రీలంకలో వ్యవసాయ రంగం దెబ్బతినడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఆ దేశం. ఇలాంటి ఈ సమయంలో చైనా నుంచి నాసిరకం ఎరువుల కాకుండా భారత్ నుంచి తీసుకునేందుకు సిద్ధమైంది. 470 కోట్ల రూపాయల కోసం ఆర్డర్ ఇచ్చింది శ్రీలంక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: