దూకుడు పెంచిన వంగవీటి రాధా.. టార్గెట్ గుడివాడ..!

Podili Ravindranath
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన కాపు నేత వంగవీటి రాధ. 2019 ఎన్నికల్లో రాధాను ఎక్కడి నుంచి బరిలో దింపాలని అర్థం కాని తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు... చివరికి రాధాను స్టార్ క్యాంప్యైనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తర్వాత వంగవీటి రాధా కొద్దికాలం పాటు పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తన మిత్రులు కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావుతో పాటు గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైసిపికి మద్దతు తెలపడంతో.. రాధా కూడా పార్టీ మారిపోతారు అనే పుకార్లు అప్పట్లో షికారు చేశాయి. వీటిపై ఏమాత్రం స్పందించని రాధ తన పని తాను చేసుకుంటూ పోయారు. 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన దేవినేని అవినాష్ అనూహ్యంగా వైసీపీలో చేరారు. దీంతో మంత్రి కొడాలి నానిని అడ్డుకోవాలంటే వంగవీటి రాధానే సరైన నేతగా టిడిపి అధినేత చంద్రబాబు భావించారు. దీంతో ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకునేందుకు రాధా రంగంలోకి దిగారు.
గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానికి చెందిన పెద్దలతో,  ముఖ్యనేతలతో రాధ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. ఏపీ సర్కార్ కాపు రిజర్వేషన్ పై ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని... ఈ సమయంలో కాపులంతా ఏకం కావాలన్నారు వంగవీటి రాధా. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ రాధా కాపు నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు రోజులకి కొడాలి నాని తో ఓ కార్యక్రమంలో పాల్గొనగా వైసీపీలో చేరుతున్నారు అంటూ పుకార్లు పుట్టించారు. ఈ వ్యాఖ్యలను పండించిన రాధా వైసీపీలో చేరేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి పేరు నాని కాపు కులం పై వెటకారంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు రాధా. రాబోయే రోజుల్లో గుడివాడ టార్గెట్గా రాధ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: