కొడాలి పాయింట్ బాగుంది.. కానీ లాజిక్ లేదా?

M N Amaleswara rao
పవన్ కల్యాణ్ ఏమంటా...రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో సినిమా టికెట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ..వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారో...అక్కడ నుంచి పవన్-వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున రగడ నడుస్తూనే ఉంది. సినిమా టికెట్లని జగన్ ప్రభుత్వం అమ్మడాన్ని పవన్ తప్పుబట్టారు. అసలు సినీ పెద్దలే తమని టికెట్లు అమ్మమని చెప్పారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే సినిమా టికెట్లు అమ్మి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టి జగన్ ప్రభుత్వం లోన్ తెచ్చుకుంటుందని, అలాగే టికెట్ల అమ్మిన డబ్బులని త్వరగా నిర్మాతలకు అందేలా చేయదని అన్నారు. అలాగే ఏదో పెద్ద హీరోలని, నిర్మాతలని చూసి ఇలా చేయడం కరెక్ట్ కాదని పవన్ మాట్లాడారు.
దీనికి వైసీపీ నుంచి కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇస్తూ... నలుగురు ప్రొడ్యూసర్లో, నలుగురు హీరోలనో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని, ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు అడ్డగోలుగా టిక్కెట్ ధరలు పెంచుకుంటున్నారని, ప్లాప్ సినిమాలకు సైతం భారీగా వసూలు చేస్తున్నారని, ఎక్కువ థియేటర్లలో సినిమాలని విడుదల చేసి జనాలను దోచుకుంటున్నారని కొడాలి ఫైర్ అయ్యారు.
అయితే సినిమా టిక్కెట్ల ధరలు పెరగకుండా ప్రభుత్వం నియత్రించడం మంచి విషయమే. విపరీతంగా సినిమా టిక్కెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం మోపకూడదని ప్రభుత్వం బాగానే ఆలోచిస్తుంది...అందుకే ధరలు కంట్రోల్ చేయాలని ప్రభుత్వమే టిక్కెట్లు అమ్మడానికి సిద్ధమవుతుంది.
సరే ఇంతవరకు కొడాలి గానీ, వైసీపీ నేతలు గానీ మంచిగానే చెప్పారు. అయితే సినిమా టికెట్ల ధరలని కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్న జగన్ ప్రభుత్వం...పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, కరెంట్ చార్జీలు, ఆర్‌టి‌సి ఛార్జీలు...ఇసుక, మద్యం, సిమెంట్...అబ్బో ఇలా ఒకటి ఏంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి వీటి ధరలు ప్రభుత్వం ఎందుకు అదుపులో పెట్టడం లేదు? పైగా ప్రభుత్వమే అదనంగా పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతుంది. కాబట్టి మొదట ఇవి కంట్రోల్ చేసి ప్రభుత్వం తర్వాత సినిమా టిక్కెట్ రేట్లని కంట్రోల్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: