టీఆర్‌ఎస్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బండి సంజయ్‌ ?

Veldandi Saikiran
తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చెర్మెన్, మా జీ ఎంపీ వినోద్.. బీజేపీ పార్టీ పై ఫైర్‌ అయ్యారు.  బిజేపీ నాయకులు తెలంగాణ ప్రభుత్వం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసారని.. బండి సంజయ్ కు ఇప్పుడు విద్యా వైద్యం గుర్తొచ్చిందన్నారు.  బండి సంజయ్ పాద యాత్ర మా పథకలకు బ్రాండ్ అంబాసిడర్ అని.. ఆయన పాద యాత్ర లో ఎటూ చూసిన పచ్చదనమే ఉందన్నారు..కాబట్టి ఆయనకు ఏం మాట్లాడా లో తెలియడం లేదు.. బండి సంజయ్ కు ప్రజలను నుండి స్పందన లేదని వెల్లడించారు.  

తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే రైతు లకు ఉదయం పూట కరెంటు వస్తుంది..మాకు వద్దు ఇంత కరెంటు అనే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు.. తెలంగాణ కు ఎంత పెద్ద కరువు వచ్చినా 3 ఏళ్ల వరకు నీటి గోస ఉండదని... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి...ఇప్పుడు 9 కాలేజీలు పెట్టామమన్నారు.  మరో 4 కాలేజీలు కూడా పెట్టె  ఆలోచన చేస్తున్నామని.. విద్యా, వైద్యం లో మాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని... బండి సంజయ్ ఎంపీ గా వుండి పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఏం మాట్లాడవని నిలదీశారు.  

ఒక్క మెడికల్ కాలేజి మీరు తీసుకురాలేదు.. తెలంగాణకు మీ రు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.  తెలంగాణ రోడ్లు అంటే విభజన హక్కు అదని... అల్వాల్,ఎర్రగడ్డ,కొత్త పెట్ ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ప్రభుత్వం మల్టిస్పెషలిటీ ఆసుపత్రులు నిర్మించబోతుందని తెలిపారు.  కర్ణాటక, మధ్యప్రదేశ్ తో పాటు మీ పాలిత ప్రాంతాల్లో మీరు చెప్పేవి అమలు అవుతు న్నాయా..అక్కడ అమలు చేయాలని... కేంద్రం నుండి తెలంగాణ కు మీరు ఆదనంగా ఇచ్చింది ఏముంది..? నిలదీశారు. తెలంగాణ లో బిజెపి వచ్చేది ఎప్పు డు సచ్చేది ఎప్పుడు..? ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: