జ‌గ‌న్ కేబినెట్ నుంచి కొడాలి అవుట్‌.. కొత్త క‌మ్మ మంత్రి ఎవ‌రో ?

VUYYURU SUBHASH
ఏపీ కేబినెట్లో మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో వాయిస్ వినిపించే మంత్రులు ఎవ‌రు ? అన్న‌ది ప్ర‌శ్నించు కుంటే ముగ్గురు న‌లుగురు మంత్రుల పేర్లు మాత్ర‌మే చెప్ప‌వ‌చ్చు. ఇందులోనూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మంత్రి ఎవ‌రంటే ఒక్క కొడాలి నాని పేరు మాత్ర‌మే ముందుగా చెప్పాలి. జ‌గ‌న్ వ‌ర్గానికే చెందిన రెడ్డి వ‌ర్గం నుంచి ఏకంగా న‌లుగురు మంత్రులు కేబినెట్లో ఉన్నారు. వీరు కూడా జ‌గ‌న్‌ను ఎవ‌రైనా అంటే గ‌ట్టిగా ప్రెస్ ముందుకు వ‌చ్చి కౌంట‌ర్లు ఇవ్వ‌లేరు. అదే కొడాలి కౌంట‌ర్ ఇస్తే ఆ ఘాటు ప్ర‌తిప‌క్షాల కు వేరేగా ఉంటుంది. జ‌గ‌న్‌కు స‌పోర్ట్ గా మాట్లాడాల‌న్నా.. ప్ర‌తిప‌క్ష టీడీపీ ని, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ను కాని.. ఆయ‌న కుమారు డు లోకేష్ ను కాని తిట్టాలంటే అది కొడాలి తిడితేనే మ‌జా ఉంటుంది రా ?  బాబు అని వైసీపీ వాళ్లే చెప్పుకుంటూ ఉంటారు.

అలాంటి కొడాలి నానిని జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో ఇప్పుడు కంటిన్యూ చేస్తారా ?  లేదా త‌ప్పించేస్తారా ? అన్న‌ది మాత్రం ఇప్పుడు స‌స్పెన్స్ గా ఉంది. ఓ వైపు జ‌గ‌న్ త‌న కేబినెట్ మొత్తాన్ని మార్చేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తం గా కేబినెట్ నే మార్చేయాల‌ని అనుకుంటే అప్పుడు జ‌గ‌న్ కు బాగా న‌మ్మ‌క‌స్తులు అయిన పెద్దిరెడ్డి, బుగ్గ‌న లాంటి వాళ్లు కూడా కేబినెట్లో ఉండ‌రు. ఇక కొడాలి నానిని మార్చేస్తే కొత్త క‌మ్మ మంత్రి ఎవ‌రు అవుతార‌న్న‌ది కూడా ఆస‌క్తి గా మారింది.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తున్నా..కమ్మ వర్గానికి క్రిష్ణా లేదా గుంటూరు జిల్లా నుంచే ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక గుంటూరు జిల్లా నుంచి చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు బ‌లంగా ఉంది. ఎందుకంటే జ‌గ‌న్ టిక్కెట్ త్యాగం చేసినందుకు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మ‌రీ మంత్రిని చేసి త‌న ప‌క్క‌న కూర్చో పెట్టుకుంటాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మండ‌లి నుంచి మంత్రుల‌ను జ‌గ‌న్ రాజ్య‌స‌భ‌కు పంప‌డంతో పాటు మండ‌లిని ర‌ద్దు చేస్తాన‌ని చెపుతున్నారు.

ఇక కృష్ణా జిల్లాకు చెందిన మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌, గుంటూరు జిల్లా నుంచి నంబూరు శంక‌ర్రావు పేర్లు కూడా పార్టీ వ‌ర్గాల్లో నానుతున్నాయి. మ‌రి జ‌గ‌న్ మ‌దిలో కొత్త క‌మ్మ మంత్రిగా ఎవ‌రు ?  ఉన్నారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: