కొడాలి రిస్క్ తీసుకుంటున్నారా?

M N Amaleswara rao

కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్...అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా చెప్పాలంటే జగన్‌ని ఎంతో అభిమానించే నాయకుడు. ఆయన్ని ఎవరైనా ఒక్క మాట అంటే చాలు...వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ....జగన్‌ని విమర్శించిన వారిపై ఫైర్ అవుతారు. ముఖ్యంగా చంద్రబాబు అంటే ఒంటికాలి మీద వెళ్తారు. అసలు బాబుపై ఎలాంటి విమర్శలు చేస్తారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.
అయితే అలా ఫైర్ చూపించే కొడాలి...ఈ మధ్య కాస్త గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేయడంలో ఇబ్బంది లేదు గానీ, ఆయన విసిరే సవాళ్ళు విషయంలోనే క్లారిటీ లేదని తెలుస్తోంది. అనవసరమైన సవాళ్ళు విసిరి రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా విమర్శల వరకు పరిమితమైతే బాగానే ఉంటుంది. కానీ ఊరికే సవాళ్ళు విసిరి ఇబ్బందుల్లో చిక్కుకునేలా కనిపిస్తున్నారు.


తాజాగా పవన్ కల్యాణ్...సి‌ఎం జగన్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ప్రభుత్వం మారబోతుందని, జగన్ మాజీ సి‌ఎం అవుతారన్నట్లుగా విమర్శలు చేశారు. అయితే పవన్‌ గానీ జగన్‌ని మాజీ సి‌ఎం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. అలాగే దమ్ముంటే పవన్ ఎమ్మెల్యేగా గెలవాలని అన్నారు. జీవితంలో పవన్...జగన్‌ని మాజీ సి‌ఎం చేయలేరని మాట్లాడారు. అంతకముందు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే...తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.
అంటే జగన్ మాజీ సి‌ఎం కావడం, కుప్పంలో చంద్రబాబు గెలవడం జరగదని కొడాలి బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సరే జగన్ నెక్స్ట్ ఎన్నికల్లో కాకపోతే, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా గెలవగలుగుతారా...అంటే ఆయనే లైఫ్ టైమ్ సి‌ఎంగా ఉండగలరా? అంటే చెప్పడం చాలా కష్టమే. పరిస్తితులు మారితే నెక్స్ట్ ఎన్నికల్లోనే జగన్ మాజీ సి‌ఎం అయిపోవచ్చు. ఇక చంద్రబాబు కుప్పంలో గెలుస్తారో లేదో...అక్కడి ప్రజల చేతుల్లో ఉంది. ఒకవేళ ఈ సవాళ్ళలో కొడాలి గెలిస్తే ఓకే.... ఓడిపోతే నిజంగానే రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అంటే అది కొడాలికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: