కోల్డ్ డ్రామా : ఎప్పటి తగువు ఇప్పుడెందుకు? సామీ !

RATNA KISHORE
పీఆర్పీలో ఉన్నప్పటి తగువులు ఎందుకని ఇప్పుడు తవ్వడం. మా అసోసియేషన్ పదవికీ కొత్త వివాదానికీ ఏంటి లింకు? అసలే నానా అవస్థల్లో , మునిగిపోయే దశలో ఉన్న చిత్ర పరిశ్రమకు ఈ గొడవలెందుకు?

పోసాని ఎందుకు మీడియా ముందుకు వస్తున్నారు? ఆయనకూ పవన్ కూ ఉన్న విభేదాలు ఇప్పటివా? అయినా ఎప్పటివో అయితే ఇప్పుడెందుకు తెరపైకి ఈ వాగ్వాదాలు, వాగ్బాణాలు? పవన్ అడిగినవి ఏంటి? వీళ్లు చెబుతున్నవి ఏంటి?కొత్త ఆన్లైన్ టికెటింగ్ విధానం వల్ల లాభం ఎవరికి? నష్టం ఎవరికి? వీటిపై పోసాని ఎందుకు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు?


మంత్రులపై పవన్ అంగీకారంలో లేని భాషను మాట్లాడారు..ఒప్పుకోవాలి..ఇదే భాషను కొడాలి నాని మాట్లాడినప్పుడో మరొక నాయకుడు మాట్లాడినప్పుడు పోసాని ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారు. ఆ రోజెందుకు మీడియా ముందుకు రాలేకపోయారు అని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
 
సర్దార్ గబ్బర్ సినిమా విడుదలై చాలా కాలమైంది. ఈ సినిమా విషయమై ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పోసాని మాట్లాడడంలో అర్థం ఏంటి? ఆంతర్యం ఏంటి? వీటి వెనుక ఉన్నదెవరు?  పరిశ్రమకు సంబంధించి వేల సమస్యలు ఉంటే వ్యక్తిగత విషయాలు ఎందుకు పైకి వస్తున్నాయి. కార్మికుల బాగు కోసం, సినిమా బతుకు కోసం ఏమయినా చేయాలనుకుంటే చేయండి అని ప్రభుత్వాలను అడిగే లేదా అభ్యర్థించే దీనావస్థలో పరిశ్రమ ఉంది. అవి వదిలి కేవలం రాజకీయాలను ప్రధాన అజెండాగా చేసుకుని మాట్లాడడంతో అటు పవన్ కానీ ఇటు పోసాని కానీ వాగ్వాదాల సరళిని వీడి మాట్లాడితేనే మేలు.

పవన్ అభిమానులు కానీ పవన్ అభిమానుల పేరిట ఉన్నవారు కానీ ఎవ్వరైనా సరే సంయమనం పాటించాలి. అదేవిధంగా మూవీ  ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల దాకా నటులు కాస్త భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. నటులను నటులతో తిట్టించే సం స్కారం ఎవరికి ఉంది? ఎవరికి ఉంటుంది? అన్నది ఒక్కసారి ఆలోచించగలగాలి. ఒకరి పరువు మరొకరు తీసుకుంటే చివరికి మిగిలేది ఏంటి? ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సంస్థలను, పరిశ్రమలను ఆదుకునే స్థితిలో ప్రభుత్వం లేదు. అసలు విషయం వదిలి కొసరు రాజకీయం ఎందుకు చేస్తున్నారని?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: