గోవాలో డ్రగ్స్... హైదరాబాద్ లింక్స్ ఎలా...?

Sahithya
తెలుగు రాష్ట్రాల మీడియా ఇప్పుడు డ్రగ్స్ మత్తులో ఉందనే మాట అక్షరాలా నిజం. డ్రగ్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు తెలంగాణాలో కూడా ఇలాంటి విమర్శలే మనం చూస్తున్నాము. తెలంగాణా ప్రభుత్వంలో ఉన్న కొందరు గ్లామర్ కోసం గానూ డ్రగ్స్ ను విరివిగా వాడుతున్నారని తెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖులను విచారిస్తున్న తరుణంలో కాంగ్రెస్ తెలంగాణా చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇవే ఆరోపణలను చేస్తూ వచ్చారు.
ఇప్పుడు ఈ డ్రగ్స్ లింక్స్ మీద ఎక్కువగా తెలంగాణా పోలీసులతో పాటుగా జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఫోకస్ చేసాయి. ఇతర రాష్ట్రాల లింకుల కోసం గట్టిగా కష్టపడుతున్నారు. గోవాలో డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్  వ్యవహారం సంచలనం అయింది. పట్టుబడ్డ డ్రగ్స్ వ్యాపారి హైదరాబాద్ వాసి సిద్ధిఖ్ గా గుర్తించారు అధికారులు. ముంబై బెంగళూరు హైదరాబాద్ లలో ఎల్ ఎస్ డి డ్రగ్స్  సప్లై చేస్తున్న సిద్దిక్... చత్తీస్ఘడ్ కు చెందిన నౌమాన్ సవేరి తో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున ఎల్ఎస్ డి డ్రగ్స్ తయారు అవుతున్నాయని గుర్తించారు.
 ముంబై, చత్తీస్గడ్,  హైదరాబాదులో విస్తరించిన డ్రగ్స్  మాఫియా మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు... వారం రోజులుగా విచ్చారిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా లో మరోసారి బయటపడ్డ  హైదరాబాద్ లింక్ తో అధికారులు స్పీడ్ గాఅలెర్ట్ అయ్యారు. శివారు ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక కంపెనీలో డ్రగ్స్ తయారు చేసి గోవా బెంగళూరు ముంబై ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లుగా అధికారుల విచారణలో వెల్లడి అయింది.  రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగి కొందరి కోసం గాలింపు చర్యలను మొదలుపెట్టాయి. హైదరాబాద్ గోవాలలో పలు ఈవెంట్లకు డ్రగ్స్ సరఫరా చేసిన సిద్దిక్ ను విచారిస్తే కీలక వ్యక్తులు బయటకు రావొచ్చు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: