షాకింగ్: కాంగ్రెస్ లోకి బాబు మోహన్...?

Gullapally Rajesh
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే కష్టపడుతున్నా కనబడుతున్న కొంతమంది నాయకులు ఆయనతో పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. రాజకీయంగా పార్టీలో ఉన్న విభేదాలు పార్టీని వెనక లాగడం అలాగే పార్టీలో కొంతమంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో దూరంగా ఉండటం వంటివి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా ఉంటుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని కీలక విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు అని కామెంట్ లు వినపడుతున్నాయి. కొంతమంది బిజెపి నాయకులను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.
బిజెపి లో ఉన్న బాబు మోహన్ అలాగే జితేందర్ రెడ్డి ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయన చర్చలు జరుపుతున్నారని ఇటీవల బాబు మోహన్ తో ఆయన ఫోన్లో కూడా మాట్లాడారు అని సమాచారం. బాబు మోహన్ తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తో సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత అని టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో ఆందోళన నుంచి జర్నలిస్టు క్రాంతి కిరణ్ ను ఎంపిక చేయడం ఆ తర్వాత బాబు మోహన్ ని పార్టీ పక్కన పెట్టడం తో ఆయన బిజెపిలో జాయిన్ అయ్యారు.
ఇప్పుడు ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదని పార్టీ రాష్ట్ర కార్యక్రమంలో ఆయన పెద్దగా పిలవడం లేదని తన నియోజకవర్గంలో కూడా మరో నేతకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు రావడంతో ఇప్పుడు ఆయన జాగ్రత్త పడుతున్నారని త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన ప్రకటన కూడా చేయవచ్చని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యారు అని కూడా పార్టీ వర్గాలంటున్నాయి. మరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: