తెలంగాణ వాకిట : ఆ...ఇద్ద‌రూ ఒక్కటే !

RATNA KISHORE
ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు తెలంగాణ‌లో జాతీయ పార్టీల‌కు సార‌థ్యం వ‌హిస్తున్నారు. సార‌థిగా ఉంటూ ప‌రిప‌క్వ రాజకీయాలు న‌డ పలేని అస‌మ‌ర్థ‌త‌లో ఉన్నారు. ద‌ళిత దండోరా పేరిట రేపు ఓ స‌భ‌కు వ‌రంగ‌ల్ కేంద్రంగా రేవంత్ సిద్ధం అవుతుండ‌గా, నిర్మ‌ల్ వాకిట మ‌రో స‌భ‌కు బీజేపీ సిద్ధం అవుతోంది. ఈ స‌భ‌ల తీరు ఎలా ఉన్నా రేవంత్, బండి సంజ‌య్ లు రేపు కూడా కేసీఆర్ ను తిట్టేందుకే త‌మ స‌మ‌యాన్నీ సామ‌ర్థ్యాన్నీ వెచ్చిస్తారు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.ఇలా చేయ‌డం వ‌ల్ల ఆయా పార్టీల అధినాయ‌క‌త్వాలు ఏమ‌యినా కొత్త ప‌ద‌వులు ఇస్తాయా? లేదా ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ప‌నులు ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా పైకి చెప్ప‌లేని దుః స్థితిలో జాతీయ పార్టీలు ఉన్నాయా? అన్న‌ది గులాబీ శ్రేణుల ప్ర‌శ్న‌.


స‌మీపంలో ఎన్నిక‌లు లేవు కానీ రేవంత్ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నాడ‌ని టీఆర్ఎస్ అంటోంది. స‌మీపంలో ఎన్నిక‌లు ఉన్నా లేక‌పోయినా బండి సంజ‌య్ కూడా ఇదే విధంగా ప్ర‌వ‌ర్తించ‌డంలో మీడియా పాత్ర కూడా ఉంది. తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష పీఠం అం దుకున్న నాటి నుంచి బండి సంజ‌య్ తీరులో ఎన‌లేని మార్పు వ‌చ్చింది. విప‌రీతంగా కేసీఆర్ ను తిట్ట‌డంతోనే ఆయ‌న క్రేజ్ తెచ్చు కోవాల‌ని చూస్తున్నారు. తాజాగా సంజ‌య్ కొన్ని లెక్క‌ల‌ను తెర‌పైకి తెచ్చి, కేటీఆర్ ను రాజీనామా చేయ‌మ‌ని అంటున్నారు. తె లంగాణ ఏర్పాటు అయ్యాక కేంద్రం ఏడేళ్ల కాల వ్య‌వ‌ధికి సంబంధించి నిధుల రూపేణ, వేర్వేరు గ్రాంటుల పేరిట రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్ల  రూపాయ‌లు అందించింద‌ని, వీటిని ఏం చేశారో చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

ఇదే సంద‌ర్భంలో కేటీఆర్ రాజీనామా చేయాల‌ని, లె క్క‌లు చెప్ప‌కుంటే మంత్రి చేయాల్సిన మొద‌టి ప‌ని అదేన‌ని కూడా అంటున్నారు. అయితే ఉన్న ప‌ళాన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రాజీనామా చేయ‌డంతో ప్ర‌జ‌లు చేకూరే లాభం ఏంటి? ప్ర‌జ‌ల‌కు అంతో ఇంతో చేయాల్సిన ప‌నుల విష‌య‌మై, అభివృద్ధి విష‌య‌మై మాట్లాడితే బాగుంటుంది కానీ ఇలా రాజీనామాలు చేయ‌మంటూ ప‌ట్టుబ‌డితే చివ‌రికి మిగిలిందేంట‌ని కూడా ప‌లువురు ప్ర‌శ్నిస్తు న్నారు. బండి సంజయ్ కోవ‌లోనే రేవంత్ కూడా కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. తిట్ల దండ‌కంతో మీడియాలో హైలెట్ అవుతున్నా రు. తిట్లు త‌ప్ప ఆధార స‌హిత లెక్క‌లు ఏవీ కేసీఆర్ విష‌య‌మై చూపించ‌లేక‌పోతున్నారు. రేవంత్ సాధించేది ఏంటి? కేసీఆర్ తో త గువు పెట్టుకుని రేవంత్ ఇప్ప‌టిదాకా పొందిన మైలేజ్ ఎంత‌? ఇవి కూడా ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: