జగన్ పై జాతీయ పార్టీ మహిళా నేత ఘాటు విమర్శలు...?

Sahithya
సిపిఎం జాతీయ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ సిఎం వైఎస్ జగన్ లక్ష్యంగా ఆమె ఆరోపణలను ఎక్కుపెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి... ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని ఆమె డిమాండ్ చేసారు. జగన్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో హోదా విషయంలో మాట్లాడటంలేదు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల హక్కు కేంద్రాన్నీ అడగాలి అన్నారు ఆమె. రాజకీయ పార్టీలు ఏకతాటిపై రావాలి అని ఈ సందర్భంగా కోరారు. ఇది పోరాటాల సమయం అన్నారు ఆమె.
ఎన్నికలు ముందు విశాఖ వచ్చి రైల్ జోన్, జోన్ కేంద్ర కార్యాలయం ఇస్తాను అన్నారు..ఎక్కడ ఉన్నాయి అవి అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉంటే చాలు అన్నారు. స్వాతంత్ర్యం కోసం కాకుండా మతం పేరిట మత పోరాటాలకు కృషి చేసింది బిజెపి అంటూ విమర్శలు చేసారు. దేశానికి పట్టిన చెద ఈ బిజెపి అంటూ వీళ్లు రాజ్యాంగ విలువలను తినేస్తున్నారు అని మండిపడ్డారు. ఆదాని, అంబానీ లకి కట్టబెడుతున్నారు అని విమర్శలు చేసారు. దేశంలో ఒక్క కార్మికులు మాత్రమే కాదు మిగిలిన రంగాలు కూడా కుదేలు అవుతున్నాయి అన్నారు.
సిపిఎం సీపీఐ వామపక్షాల డిమాండ్ ఒకటే ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేయొద్దని కోరారు. అది మీ పదవికి మీ ప్రభుత్వానికి ముప్పు అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అని డిమాండ్ చేసారు. పార్లమెంట్ లో సంఖ్య బలం చూపించి చట్టంచేసుకోవడం అప్రజాస్వామికం అని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం భారం మహిళలు మీద పడుతుంది అని విమర్శించారు. కేవలం ఒక్క ఏడాదిలో 69 సార్లు ధరలు, పెట్రో ఉత్పతులు పెరిగాయి అన్నారు. మోసం చేయడం, ధరలు పెంచడం, అసత్యాలు ప్రచారం చేయడంలో మోదీ విశ్వ గురువు అంటూ ఈ సందర్భంగా విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: