`వ‌రి` ఉరి.. లక్ష కోట్ల ప‌రిస్థితి మ‌రి..?

Paloji Vinay
    అనుకున్న‌ది ఒక్క‌టి అయ్యింది ఒక్క‌టి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు చూపు లేని నిర్ణ‌యంతో ల‌క్ష కోట్లు బూడిద‌లో పోసిన ప‌న్నిర‌య్యాని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ఇటీవ‌ల వ‌రి వేస్తే ఉరేన‌ని సీఎం కేసీఆర్ రైతుల‌కు వ‌రి వేయ‌కుండా ఇత‌ర పంట‌ల‌ను వేయాల‌ని సూచించిన సంగ‌తి తెలిసిందే. వ‌రి పండేందుకు నీరు ఎక్కువ అవ‌స‌ర‌మున్నందున్న ప్రాజెక్టులు ఉప‌యోగ‌ప‌డుతాయి. మ‌రి వ‌రి వేస్తే న‌ష్టం అని చెబుతున్న ప్ర‌భుత్వం వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్రాజెక్టులు కట్ట‌డం ఎందుక‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

       బంగారు తెలంగాణ‌లో కోటి ఎక‌రాల మాగాణిని నీళ్లు అందించేందుకు కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించిన‌ట్టు చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్‌. అలాగే ల‌క్ష కోట్ల‌తో తెలంగాణ‌కు దిక్సూచిగా కాళేశ్వ‌రం నిర్మిస్తామ‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. త‌రువాత ఆగ‌మేఘాల మీద ప‌నులు ప్రారంభించేశారు. అయితే, దానికి అనుగుణంగా మూడు ప్రాజెక్టులు దాంట్లో రిజ‌ర్వాయర్లు కూడా నిర్మించింది ప్ర‌భుత్వం. ఇవ‌న్ని ఎత్తి పోత‌ల ప‌థ‌కాలే.
    ఎట్ట‌కేల‌కు ప్రాజెక్టును పూర్తి చేసింది ప్ర‌భుత్వం.. నిజానికి ఉత్త‌ర తెలంగాణ‌లో వ‌రి  ప్ర‌ధాన పంట. కానీ ఇప్పుడు దానినే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్దంటున్నారు. మ‌రి దేని కోసం ల‌క్ష కోట్లు పెట్టి ప్రాజెక్టుల‌ను నిర్మించార‌నే ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది. ఏది వ‌ర‌ప్ర‌ధాయ‌నిగా మారుతుంద‌నుకున్నారో అదే శాపంగా మారుతుంద‌ని అనుకుంటున్నారు.  ఎందుకంటే వ‌రి పంట‌కే ఎక్కువ నీరు అవ‌సరం ఉంటుంది. మిగ‌తా పంట‌ల‌కు త‌క్కువ‌గా ఉంటుంది.


వ‌రేత‌ర పంట‌ల‌కు త‌మ ప్రాంతాల ప‌రిధిలో ఉన్న చెరువులు, కుంట‌లు, బోరు బావుల ద్వారా , వ‌ర్షం ద్వారా నీరు స‌రిపోతుంది. మ‌రి అలాంట‌ప్పుడు నెల‌కు వేల కోట్లు క‌రెంట్ బిల్లు వ‌చ్చే ల‌క్ష కోట్ల ప్రాజెక్టును ఎందుకు నిర్మించార‌ని అప్పుడే ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టేశాయి. వ‌రిని కొన‌లేమ‌ని కేంద్రం చేతులెత్తేసింది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని గోదాముల‌న్ని నిండిపోయాయి. దీంతో అటు ప్రాజెక్టు క‌ట్టినందుకు కోట్ల మిత్తిలే త‌డిసి మోప‌డ‌వుతున్న వేల.. రాష్ట్రా తాహ‌త‌కు మించి పంట‌ను కొనుగోలు చేయాలంటే తెలంగాణ ప్ర‌భుత్వానికి త‌ల‌కు మించిన భారం అవుతుంది. దీంతో వ‌రి కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఉరిగా మారుతుంద‌ని ప్రతిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: