చిన్నారి చైత్ర : కేసీఆర్ ఫెయిల‌య్యాడా ?

RATNA KISHORE
పోలీసులు చెప్పిన వ‌న్నీ వినండి..ప్ర‌భుత్వం చెప్పిన‌వ‌న్నీ వినండి..నిజాలు దేవుడికి ఎరుక‌. కానీ ఈ సంఘ‌ట‌న‌లో ఓడిపోయింది మాత్రం వ్య‌వ‌స్థ‌నే! ఇంత‌టి ఆధునిక సాంకేతిక‌త ఉన్న రోజుల్లోనూ నిందితుడ్ని ప‌ట్టుకోలే క‌పోవ‌డం అన్న‌ది నిజంగానే పోలీసుల అస‌మ‌ర్థ‌త అని తేలిపోయింది. కేసీఆర్ ప‌నితీరు బాలేని కార‌ణంగానే పోలీసు వ్య‌వ‌స్థ కూడా చెప్పుకునేంత స్థాయిలో,ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌డం లేద‌న్న వాదన‌లూ ఉన్నాయి. అందుకే రాజు పోలీసుల‌కు చిక్క‌లేదు. త‌నంత‌ట తానే శ‌వ‌మై తేలాడు.

చిన్నారి చైత్ర‌ను అత్యంత పైశాచికంగా చంపేసిన నిందితుడు రాజు ఎట్ట‌కేల‌కు శ‌వ‌మై ప‌ట్టాల‌పై తేలాడు. ఆత్మ హ‌త్య అని పోలీసులు చెబుతున్నారు. ఘ‌ట్ కేస‌ర్ కు సమీపాన ఉన్న ప‌ట్టాల‌పై ఆయ‌న మృత‌దేహం గుర్తించామ‌ని చెబుతున్నారు. ఇదంతా ఓకే కానీ నిందితుడ్ని ప‌ట్టుకోవ‌డంలో తెలంగాణ పోలీసు కానీ తెలంగాణ స‌ర్కారు న‌డిపే బాస్ కేసీఆర్ కానీ విఫ‌లం అయ్యార‌ని అనుకోవ చ్చా? ఎప్ప‌టి నుంచో చిన్నారుల‌పై అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిని తెలంగాణ పోలీసు ప‌ట్టుకోలేరా లేదా గుర్తించ‌లేరా? అస‌లు పాత నేర‌స్తుల జాబితా అన్న‌ది ఒక‌టి ఉంటుంది క‌దా! మ‌రి వారిని స‌మాజంలోకి వ‌దిలిన‌ప్పుడు వీరు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు ఏంటి?
చిన్నారి చైత్ర కేసు విష‌యంలో ముమ్మాటికీ కేసీఆర్ విఫ‌లం అయ్యారు. రాజు విష‌య‌మై రివార్డు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అదేమంత ప్ర‌భావం చూప‌లేదు. ఒక‌వేళ రాజు ఆత్మహ‌త్య చేసుకున్నాడ‌ని పోలీసు చెప్పినా అది కూడా వ్య‌వ‌స్థ వైఫ‌ల్య‌మే. వ్య‌వ‌స్థ‌ను స‌రిగా న‌డ‌ప‌డం రాని కేసీఆర్ వైఫ‌ల్య‌మే అని త‌ప్ప‌క విప‌క్షాలు గ‌గ్గోలు పెడ‌తాయి. రాజు ఉదంతం ఎలా ఉన్నా ఈ రోజు మ‌రో కేసు హైద్రా బాద్లో న‌మోదైంది. మంగ‌ళ్ హ‌ట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మాంగారు బ‌స్తీలో ఓ నిందితుడిపై అత్యాచార అనుమానాలు వ్య‌క్తం అవు తున్నాయ‌ని తెలుస్తోంది.  ఇప్పుడయినా పోనీ దీనిపైనైనా స‌రిగ్గా స‌మ‌గ్ర వివ‌రం పోలీసులు ఇవ్వ‌గ‌ల‌రా?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: