నేడే ఏపీ కేబినేట్ భేటీ: వీటి గురించే నేడు చర్చ?

Sahithya
నేడు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రివర్గం భేటీ అవుతున్నది. ఉదయం 11 గంటల నుండి సమావేశం జరుగుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనారోగ్య కారణాల వల్ల మంత్రి బొత్స, అనిల్ లు కేబినేట్ కు గైర్హాజరు అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెప్తున్నాయి. మొత్తం 40 అంశాలు అజెండా గా కేబినెట్ లో నేడు చర్చ జరుగుతుంది. ఆసరా రెండోవిడత మొత్తం విడుదలకు మంత్రిమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉందని మీడియా అంటుంది.
స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ పై చర్చించి ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాండర్డ్ అథారిటీకి ఆమోదం తెలిపే సూచనలు ఉన్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేలు అదనపు రుణం ఇప్పించే ప్రతిపాదన పై చర్చ జరుగుతుంది. స్కూల్స్ , ఆస్పత్రులకు సాయం చేసిన దాతల పేర్లు పెట్టే విధానం పై చర్చ కేబినేట్ లో జరిగే అవకాశం ఉంది. విశాఖలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు, శ్రీకాకుళంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు పై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాల ఏర్పాటు పై చర్చించి ఆమోదం తెలిపే సూచనలు ఉన్నాయి. కేబినేట్ కు ముఖ్యమంత్రి, మంత్రులు వస్తుండడం తో రాజధాని గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. బయటి వారిని గ్రామాల్లోకి పోలీసులు అనుమతించకపోవడం వివాదాస్పదం అవుతుంది.సీఎం  వస్తున్న నేపధ్యంలో సచివాలయ ప్రాంతాల్లో ఎటువంటి నిరసన కార్యక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. మంత్రి బొత్సా సత్యనారాయణ కరోనాతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: