బాబోరి రేవంత్‌కు స‌పోర్ట్‌ అందుకే లేదా..?

Paloji Vinay
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌ను నియ‌మించ‌డం గిట్టని వాళ్లు పార్టీలో చాలామందే ఉన్నారు. నాకంటే నాకు అని టీపీసీసీ చీఫ్ ప‌ద‌విపై గ‌తంలో చిన్న పాటి వారే న‌డిచింది. పార్టీని త‌మ‌ చేతిలో పెడితే పార్టీ భ‌విష్య‌త్తును మార్చుతాన‌ని చెప్పుకొచ్చారు. ఇలా అంత‌ర్గ‌త పోరులో రేవంత్ రెడ్డిపై హ‌స్తం అధిష్టానం మొగ్గు చూపింది. ఎట్ట‌కేల‌కు చాలా రోజుల ఉత్కంఠ త‌రువాత టీపీసీసీ ప్రెసిడెంట్ గా తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్‌ను ఎంపిక చేసింది.

 
     నిజానికి రేవంత్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడికి ఉండాల్సిన అర్హ‌త‌లు అన్నీ ఉన్నాయి. కానీ, పార్టీ లోప‌ల మాత్రం ఆయ‌న‌కు స‌రిప‌డా స‌పోర్ట్ లేదు. సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, శ్రీ‌ధ‌ర్‌బాబు, ష‌బ్బీర్ అలీ ఇలా కొంద‌రు నాయ‌కులు రేవంత్‌కు అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ ప‌ద‌వి చేప‌ట్టిన అనంత‌రం.. స్వ‌యంగా తానే పార్టీలో అసంతృప్తిగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుల ఇంటికి వెళ్లీ మ‌రి ప‌ల‌క‌రించి వ‌చ్చాడు. కానీ అది పెద్ద‌గా ఫ‌లించిన‌ట్టు అనిపించ‌లేదు. త‌రువాత రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన స‌భ‌లు కార్య‌క్ర‌మాల‌కు, పార్టీ వ్య‌వ‌హారాల‌కు అంటి ముట్ట‌న‌ట్టుగా దూరంగానే ఉంటూ వ‌చ్చారు కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు.


   రేవంత్ రెడ్డికి స‌పోర్ట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి త‌మ‌కంటే పార్టీలో జూనియ‌ర్ త‌మ పెత్త‌నం చెలాయించ‌డం ఏంటి అనే భావ‌న ఒక కార‌ణం అయితే ఆది నుంచి పార్టీలో ఉంటూ పార్టీ కోస‌మే ప‌ని చేసిన త‌మ‌ను ప‌క్క‌న పెట్టి కాంగ్రెస్ నాశ‌నం కావాల‌ని చూసిన తెలుగుదేశం పార్టీ నుంచి వ‌చ్చిన రేవంత్‌కు త‌మ క‌ళ్ల ముందే నాయ‌కుడి హోదా ఇవ్వ‌డం ఇంకొక‌టి అయితే, రేవంత్ రెడ్డి పార్టీ మారినా చంద్ర‌బాబు శిష్యుడిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ కూడా ఇంకో కార‌ణంగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. దీనికి ఆజ్యం పోస్తూ రేవంత్ రెడ్డి అనేక సంద‌ర్భాల‌లో త‌న రాజ‌కీయ గురువు ఆంద్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని బహ‌రంగంగానే పొగుడుతూ వ‌చ్చాడు. దీంతో రేవంత్ కు ఇంకా `ప‌సుపు` మ‌ర‌క పోలేద‌ని కాంగ్రెస్ పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: