తెలంగాణ కాంగ్రెస్‌కు వాళ్లే మైన‌సా..?

Paloji Vinay
గ‌త ఏడేళ్లుగా జ‌వ‌స‌త్వం లేని కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి నియామ‌కంతో పార్టీలో ఊపు వ‌చ్చింది. తెలంగాణ రాజ‌కీయాల్లో మొద‌టి నుంచే ఫైర్ బ్రాండ్‌గా రేవంత్‌కు పేరుంది. సీఎం కేసీఆర్ పై భారీ విమ‌ర్శ‌నాలు సందించడంలో ఆయ‌నది అంద‌వేసిన చేయి. ఎప్ప‌టిక‌ప్పుడూ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నిస్తూనే ఉన్నాడు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేత‌ల పైనా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

   రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ అయిన త‌రువాత త‌న దూకుడును మ‌రింత‌గా పెంచారు. కానీ, రేవంత్ ను టీపీసీసీ ప్రెసిడెంట్‌గా నియమించ‌డం ఇష్టం లేని  వాళ్లు చాలా మందే ఆ పార్టీలో ఉన్నారు. రేవంత్ నాయ‌క‌త్వంలో  న‌డ‌వ‌డానికి అయిష్టాన్ని వ్య‌క్తం కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు. బ‌హిరంగంగానే రేవంత్ రెడ్డి పై  వ్య‌తిరేక గ‌ళం వినిపించారు. ఆది నుంచి పార్టీలో తామే మోనార్కుల‌మంటు వ్య‌వ‌హరిస్తున్న‌వారు కొంద‌రు ఉన్నారు. సీనియారిటీని బ‌ట్టి త‌మకు టీపీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాల‌ని చెప్పిన‌వారు కూడా ఉన్నారు. కానీ పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు, అధికారం దిశ‌గా న‌డ‌వ‌డానికి త‌మ‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని చెప్పిన‌వారెవ‌రు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
   
     అయితే, కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌గానే ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఎవ‌రికి వారు ఎమునా తీరే అంటూ పార్టీ వ్య‌వ‌హారాలు, నియమాల‌తో సంబంధం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తారు. కొమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, బ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వి. హ‌నుమంత‌రావు, రేణుకా చౌద‌రి ఇలా కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు త‌మ‌కు తామే పార్టీని నడిపిస్తున్నామ‌ని భావిస్తారు. సినియ‌ర్ ల‌ వ్య‌వ‌హారాల వ‌ల్ల రాష్ట్ర ప్ర‌జ‌ల ముందు పార్టీ ప్ర‌తిష్ట దెబ్బ‌తింటుంద‌ని ఇది స‌రైన ప‌ద్ధితి కాద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చాలా రోజుల నుంచి చ‌ర్చ న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: