కేసీఆర్ దోస్తు మ‌హా ఘాటు?

RATNA KISHORE

పాల‌కుల‌కు క్షేత్ర స్థాయిలో ఏం  జ‌రుగుతోందో తెలియాలి. అవి తెలియ‌క‌పోతే ఏం చేసినా వ్య‌ర్థ‌మే. చుట్టూ ఉన్న భ‌జ‌న గాళ్లతో ప్ర‌మాదం. అలాంటివారిని ఎంత మందిని వ‌ద్ద‌నుకుంటే అంత మంచిది. మేలిమి బంగారం లాంటి స్నేహితుడు ఒక్క‌డే చాలు. చాలా రోజుల‌కు స్నేహితుడు దొరికాడు కేసీఆర్ కు. ఎన్నో విష‌యాలు చెప్పాడు. స‌ర్ మీరు కాస్త ఆలోచించాలి నేను చెప్పేవి అని విన్నవించాడు. ఆయ‌న మాట‌లు కేసీఆర్ ఒక్క‌డే హ‌రీశ్ విన్నాడు. కేటీఆర్ కూడా విన్నాడు. విన్న‌వి ఆచ‌రించ‌డం కేసీఆర్ బాధ్య‌త‌. సాగును స‌స్య‌శ్యామ‌లం చేయాల్సిన బాధ్య‌త కేసీఆర్ ది. అందుకే స్నేహితుడి మాట విని వ‌దిలేయ‌కండి స‌ర్...అని విన్న‌వించుకుంటున్న‌ది ఇందుకే!


రాష్ట్రంలో వ్య‌వ‌సాయం ఎలా ఉంది? మ‌నం తీసుకువ‌స్తున్న ప‌థ‌కాలు కానీ  వాటి వివ‌రాలు కానీ సాగుదారుల‌కు సాయం చేస్తు న్నాయా? అస‌లు ఇన్ని ర‌కాల పంట‌లు ఉన్న‌ప్పుడు రైతుల‌కు వ‌రి ఒక్క‌టే ఎందుకు ప్రాధాన్యాంశం అవుతుంది? ఇలాంటివి త‌రు చూ ఆలోచించాల్సిన ప్ర‌శ్నలు. పాల‌కులు కేవ‌లం రుణమాఫీ ఇవ్వ‌డ‌మో, రైతు బంధు ఇవ్వ‌డ‌మే కాకుండా పంట‌ల సాగుకు విభి న్నం అయిన పంట‌ల సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలి. వాణిజ్య పంట‌ల‌కు ఊతం ఇవ్వాలి. ఇవేవీ లేకుండా ఏం చేసినా వ్య‌ర్థ‌మే. కేసీఆర్ ఈ దిశ‌గా ఆలోచించేందుకు ఓ స్నేహితుడు కార‌ణం అయ్యాడు. ఆయ‌న ఈయ‌న‌తో ఎన్నో విష‌యాలు చెప్పాడు. సేద్యం లాభ‌దాయ కంగా మార్చాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే అని కూడా చెప్పాడు. త్వ‌ర‌లో మిమ్మ‌ల్ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు పిలుస్తాను అని చెప్పి కేసీఆర్ ఆయ‌న‌లో కొత్త సంతోషాలు నింపారు.



నిన్న‌టి వేళ కేసీఆర్, త‌న పాత దోస్తు జ‌గిత్యాల టీఆర్ఎస్ లీడ‌ర్ జితేంద‌ర్ ను క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో చాలా విష‌యాలు చ ర్చించారు. ముఖ్యంగా వ్య‌వ‌సాయం ఏవిధంగా న‌డుస్తుంది అన్న‌ది ఆయ‌న‌ను అడిగి తెలుసుకున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా జ‌రి గిన ఓ ఫంక్ష‌న్ హాజ‌ర‌యిన సంద‌ర్భంగా చాలా విష‌యాలు రాబ‌ట్టారు. ముఖ్యంగా వ్య‌వ‌సాయం పైనే ఆయ‌న దృష్టి అంతా సారించా రు. అర‌టికి మార్కెటింగ్  సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, తాను సాగు చేసిన అర‌టికి ఎక‌రాకు ల‌క్ష రూపాయ‌లు మిగిలింద‌ని, ఉద్యా న వ‌న శాఖ ప్రోత్సాహ‌కాలు ఉంటే ఏమ‌యినా సాధ్య‌మేన‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: