వ‌రి వ‌ద్ద‌నే అంటున్నారు ఎందుకు?

RATNA KISHORE

సిరులిచ్చే నేల‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఇదే సంద‌ర్భంలో సిరులిచ్చే నేల‌ను కాపాడేందుకు ప్ర‌భుత్వం తీసుకుం టున్న చ‌ర్య‌లు ఏమీ లేవు. నేల సారాన్ని పెంచేందుకు, ఉత్ప‌త్తి భారం త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం చేసే సాయం ఏమీ లేదు. పూల సాగు, పండ్ల తోట‌ల సాగు అన్న‌వి ప్రోత్సాహక‌రంగా లేవు. క‌నుక‌నే అంతా సాగు అంటే వ‌రి అనే అర్థం లోకి వ‌చ్చేశారు. ఆంధ్రాలోనే కాదు తెలంగాణ‌లోనూ వ‌రి సాగు అంత‌గా క‌లిసి రావ‌డం లేదు. పంట దిగుబ‌డులు వ‌చ్చే స‌మ‌యానికి తాము పూర్తిగా న‌ష్ట‌పోతు న్నామ‌ని, కొన్ని సార్లు పంట కాలం త‌గ్గించేందుకు స‌రికొత్త వంగడాలు వేసినా ఫ‌లితాలు బాగుండ‌డం లేద‌ని రైతులు వాపోతున్నా రు. ఈ ద‌శ‌లో ఆంధ్రాలో కూడా ప్ర‌త్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి. రైతుకు ఉపాధి ప‌థ‌కాన్ని అనుబంధంగా చేస్తే కొంతయినా కూలీల రేట్లు త‌గ్గి వారికి ఓ ఆస‌రా వ‌స్తుంద‌ని కూడా అంటున్నారు. ఆంధ్రాలో చెర‌కు, పొగాకు, ప‌త్తి సాగుపై కూ డా ఇప్ప‌టికే ఆస‌క్తి ఉన్నా అవి ఆశించిన ఫ‌లితాలు లేవు. అదేవిధంగా గుంటూరుకు మిర‌ప, నిజామాబాద్ కు ప‌సుపు యార్డులు ఉన్న‌ప్ప‌టికీ పంట‌కు త‌గ్గ రేటు ఎప్పుడూ అందుకోలేక‌పోతున్నారు.



జ‌గ‌న్ చెప్పిన విధంగా పంట ప్రోత్సాహ‌కాలు ఏవీ లేవు. మంచి పంట‌లు పండితే ఆద‌ర్శ రైతులు కింద గ‌తంలో గుర్తించి గౌర‌వించే వారు. ఈ సారి అలాంటివేవీ లేవు. ఆధునిక ప‌ద్ధ‌తుల కార‌ణంగా త‌క్కువ కాలంలోనే మంచి పంట‌లు ఇంటికి తెచ్చుకునేందుకు అవ‌కాశం ఉన్నా వారికి అవి ద‌క్క‌డం లేదు. విత్త‌న శుద్ధి కూడా గ్రామాల్లో అంతంత మాత్ర‌మే అవుతోంది. ఆర్బీకే సెంట‌ర్ల ప‌నితీరుపై ఇంకా స్ప‌ష్ట‌త రావ‌డం లేదు.



వ‌రి సాగు లాభ‌దాయ‌కం కాదు అని అంటున్నారు కొంద‌రు. ఏటా న‌ష్టాలు త‌ప్ప ఏమీ మిగ‌ల‌డం లేద‌ని కూడా అంటున్నారు ఇం కొంద‌రు. దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమయినా వెత‌కాలి అని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఉద్యాన వ‌న పంట‌ల సాగుతో లా భాలు వ‌స్తాయ‌ని, ఆ దిశ‌గా ఆలోచిస్తే బాగుంటుంద‌ని కేసీఆర్ స్నేహితుడు జీతేంద‌ర్ ప్ర‌భుత్వానికి సూచించారు. జ‌గిత్యాల‌కు చెంది న ఈయ‌న తాను వ‌రి వేయ‌లేద‌ని, అర‌టి సాగుతో కాస్త లాభాలు వ‌చ్చాయ‌ని, ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించి, ఉద్యాన వ‌న శాఖ ప్రోత్సా హ‌కాలు అందిస్తే మంచి ఫ‌లితాలు అందుకోవ‌చ్చ‌ని చెప్పారు. అలానే ఈత  చెట్ల పెంప‌కాన్ని డ్రిప్ ద్వారా చేశామ‌ని, నీరాతో గీత కా ర్మికులు మంచి లాభాలు చ‌వి చూశార‌ని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: