ఆ జనసేన నేతలకు మంచి ఛాన్స్...పవన్ కాస్త ఫోకస్ చేస్తే...

M N Amaleswara rao
ఏపీలో జనసేన బలం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ పార్టీకి 175 నియోజకవర్గాల్లో పెద్దగా బలం లేదని గత ఎన్నికల్లో రుజువైపోయింది. కాకపోతే రాజోలు నియోజకవర్గంలో గెలిచి కాస్త అక్కడ బలం ఉందని జనసేన చాటి చెప్పింది. అయితే జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాజోలులో కూడా జనసేన బలం తగ్గింది.

 
కాకపోతే పవన్ కల్యాణ్ కాస్త ఫోకస్ చేస్తే జనసేన కొన్ని నియోజకవర్గాల్లో పుంజుకునే అవకాశం చాలావరకు ఉంది. ఎన్నికలైపోయిన దగ్గర నుంచి పవన్ కల్యాణ్ మళ్ళీ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తూ వస్తున్నారు. దీని వల్ల ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోతుంది. ఆయన సినిమాలు తీయడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు...కానీ పార్టీని గాలికొదిలేయడమే పెద్ద సమస్య అయిపోతుంది.
ఏదో అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు చేయడం వల్ల పార్టీకి అసలు బెనిఫిట్ లేకుండా పోతుంది. అసలు పవన్ సీరియస్‌గా రాజకీయం చేస్తే చాలా చోట్ల పార్టీ పికప్ అయ్యేది. అలాగే ఆయన ప్రజా సమస్యలపై వరుసపెట్టి పోరాటం చేస్తే పార్టీకి మైలేజ్ వచ్చేది. కానీ ఈ రెండేళ్లలో పవన్ ఆ కార్యక్రమం చేయలేదు. అయితే ఇకనుంచైనా పవన్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేసి పార్టీని పికప్ చేయాలని జనసైనికులు కోరుకుంటున్నారు.
పూర్తి స్థాయిలో గెలిచే సత్తా లేకపోయినా కనీసం, గత ఎన్నికల్లో మంచిగా ఓట్లు పడ్డ నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తే పార్టీకి బెనిఫిట్ అవుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో రాజోలులో గెలిస్తే, నరసాపురం, భీమవరం, గాజువాక స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో జనసేన ఉంది. అలాగే సుమారు 25 స్థానాల్లో ఓట్లు మంచిగా పడ్డాయి. అలాంటి నియోజకవర్గాలపై ఫోకస్ చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తే, నెక్స్ట్ ఎన్నికల్లో కనీసం 10 సీట్లు అయిన గెలుచుకునే ఛాన్స్ ఉంటుందని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: