ఆ నీచుడి ఆనవాళ్లు దొరికాయి.. ఈ రాత్రే పట్టుకుంటాం..?

NAGARJUNA NAKKA
హైదారాబాద్ లో చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 1000సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ దగ్గర రోడ్డు దాటుతుండగా గుర్తించామన్నారు. నిన్న రాత్రి వైన్ షాప్ దగ్గర రాజు కవర్ స్వాధీనం చేసుకున్నామనీ.. అందులో కల్లు సీసా, టవల్ ఉన్నాయని తెలిపారు. ఈ రాత్రిలోగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
నిందితుడికి మద్యం తాగే అలవాటు ఉండటంతో రాష్ట్రంలోని 2వేల 200 మద్యం షాపులు, కల్లు కాంపౌండ్ల యజమానులు అప్రమత్తం చేశారు. ప్రతి వైన్ షాపుకు రాజు ఫోటోలు పంపించారు. హైదరాబాద్ లోని కూలీ అడ్డాల దగ్గర నిఘా పెంచారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలపై రాజు పోస్టర్లు అతికిస్తున్నారు. అతని ఆచూకీ తెలిపిన వారికి 10లక్షల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు.
ఎవరూ గుర్తుపట్టకుండా నిందితుడు రాజు మారు వేషాలతో తిరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఎవరికీ దొరకకుండా అతడు జుట్టు, గడ్డం లాంటి మార్పులు చేసుకునే అవకాశముందని చెప్పారు. ఒకవేళ మార్పులు చేసుకునే అవకాశముందని చెప్పారు. ఒకవేళ నిందితుడు మార్పులు చేసుకుంటే ఎలా ఉంటాడో అతడిని పోలిన చిత్రాలను పోలీసులువిడుదల చేశారు. ఎవరికైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరారు.
మరోవైపు సైదాబాద్ హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని.. చాలా బాధపడ్డారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ కేసుపై డీజీపీ, సీపీలతో సమీక్షించిన అలీ.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని ఆదేశించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో విచారణ చేయాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. అటు చిన్నారిపై హత్యాచారం ఘటన దురదృష్టకరమన్న మంత్రి సత్యవతి రాథోడ్.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: