చిన్నారి చైత్ర : షర్మిల‌కు పొలిటిక‌ల్ మైలేజ్ వ‌చ్చేసిందా?

RATNA KISHORE

ఎవరి బాధ‌లు వారే మోయాలి. ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌ని ప్ర‌భుత్వం చేయాలి. ఇప్పుడేంటి దీక్ష‌లు. ప‌దికోట్ల ప‌రిహారం ఇప్పుడు ఇచ్చారే అనుకుందాం స‌మ‌స్య‌లు సాల్వ్ అయిపోతాయా? ఏం అడ‌గాలి? ఏం అడుగుతున్నారు? త‌ప్పు ఎవ‌రిది? మ‌నం మార‌కుం డా ఇత‌రుల‌ను మారేందుకు ప్ర‌య‌త్నించ‌మ‌ని అడ‌గ‌డంలో అవివేకం ఉంది. ఈ రాజ‌కీయ‌నాయ‌కులలో అదే ఉంది. అందుకే అం త అవివేకంగా మాట్లాడుతున్నారు. అందుకే సంద‌ర్భం లేకున్నా దీక్ష‌లు పేరిట తిట్ల దండకం ఒక‌టి అందుకుంటున్నారు. స‌బ‌బేనా?

 
శ‌వ‌మై ఉన్న కూతుర్ని చూసి త‌ల్లీ తండ్రీ గుండెల‌విసేలా ఏడుస్తున్నారు. రాజ‌కీయాల‌కు త‌గిన స‌మ‌యం ఇదే అనుకుంటూ కొన్ని పార్టీలు కేసీఆర్ ను తిడ్తాయి. కొన్ని కేటీఆర్‌ను తిడ్తాయి. ఇలా తిట్ట‌డంలో ఏమీ లాభం లేద‌ని వాళ్ల‌కు తెలుసు. వాళ్లు కోరుకున్న పొలిటికల్ మైలేజ్ ఇదే! అది వ‌స్తే చాలు అన్నీ చ‌క్క‌దిద్దుకుంటాయి. చిన్నారి చావు నుంచి స‌మాజం నేర్చుకున్న‌దేదీ లేదు. ఉండ‌దు కూడా! ఉండ‌దు క‌దా వ‌దిలేయండి. ష‌ర్మిల గారూ మీరు దీక్ష‌లు చేయ‌కండి ప్లీజ్ ! ఇది అనుకూల స‌మ‌యం కాదు. గ‌మ‌నించ‌గ‌ల‌రు.
ఏ యుద్ధ‌మో విప్ల‌వ‌మో రావాలి అని కోరుకోవాలి అని చెప్పారొక‌రు. చ‌దివేను. ఆనందించేను. విప్ల‌వం అంటే స‌మూహంలో వ‌చ్చే మార్పు అని రాయాలి. ర‌క్తం నేల‌ను తాక‌కుండా మార్పు రాద‌ని రాయ‌లేం. కానీ వ‌స్తే మంచిది. రాజు గాడిని ఎన్కౌంట‌ర్ చేయండ హే! అని అంటున్నారు. ఇంత‌కూ రాజు గాడు ఎప్పుడు పట్టుబ‌డ‌తాడు. ఉప్ప‌ల్ దాటేసిన రాజుగాడు పోలీసుల‌కు చిక్కి, త‌రువాత ఏమౌతాడు? ఇవ‌న్నీ త‌రువాత ఇవాళ పాత‌బ‌స్తీలో మ‌రో రాజుగాడు క‌నిపించాడు. వాడ్ని ఏం చేద్దాం. ఏం చేస్తే ఈ స‌మాజం మారు తుంది. ఇంత జ‌రిగినా ష‌ర్మిల మైయిలేజీ కోరుకుంటున్నారు. రాజ‌కీయంగా ఎద‌గాల‌నుకుంటున్నారు. లేదా కేసీఆర్ ను ఇరికించి పేరు తెచ్చుకోవ‌డం ఓ ప్ర‌ధాన అవ‌ధిగా చేసుకున్నారు. ఎవ‌రు ఓడిపోయారు స‌ర్.. ష‌ర్మిల మేడ‌మ్ ఎవరు స‌ర్?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: