జగన్ పై కాంగ్రెస్ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు...?

Gullapally Rajesh
ఏఐసీసీ కార్యాలయంలోఅఖిల భారత మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ... అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కొత్త లోగోను ఆవిష్కరించారు. ఆవిర్భావ వేడుకల్లో పెద్ద ఎత్తున్న మహిళ  కాంగ్రెస్ నేతలు పాల్గొని విజయవంతం చేసారు. అవిర్బవ వేడుకల్లో ఏపీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రమిళమ్మ, సుంకర పద్మ శ్రీ ,పలువురు మహిళ నేతలు  హాజరు అయ్యారు. తెలంగాణ నుండి ఎమ్మెల్యే సీతక్క , ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మా శ్రీ, నెరేళ్ల శారదా పలువురు మహిళ నేతలు హాజరు అయి విజయవంతం చేసారు అని అన్నారు.
భారతదేశ వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ అవిర్బవ దినోత్సవం శుభాకాంక్షలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మహిళల పై జరగతున్న దాడులు, అత్యాచారాలు ,లైంగిక దాడులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కలిపించడంలో వైఫల్యం అయ్యాయి అని ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు వ్యాఖ్యలు చేసారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పై విపరీతంగా దాడులు పెరిగాయి అని అన్నారు. క్రైమ్ రేటు ఎక్కువగా ఉందని నివేదికలు వచ్చాయి అని ఆమె వెల్లడించారు.
చిన్న పిల్లలను అత్యాచారం చేసి చంపేస్తున్నా రెండు రాష్టాల ముఖ్యమంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని సునీత రావు అన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ... ఏపీ రాజధాని నడిబొడ్డున ముఖ్యమంత్రి ఇంటి పక్కన మహిళల పై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అవ్వడం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అన్నారు ఆమె. జగన్ అధికారంలోకి రావడానికి కారణమైన దళితులు, మహిళల పై నేడు దాడులు జరుగుతున్నాయి అని వ్యాఖ్యలు చేసారు. మానవ మృగాలు ఆడపిల్లలను అత్యాచారం చేసి చంపేస్తున్నారు అని విమర్శించారు. రాష్టంలో డమ్మీ హోమంత్రిని పెట్టారు అన్నారు. రాజకీయ స్వార్ధపూరితంగా ప్రభుత్వం వ్యహరిస్తుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: