బిగ్ బ్రేకింగ్: ఏపీ కొత్త సీఎస్ కు ఏపీ హైకోర్ట్ షాకింగ్ ఆహ్వానం...?

Gullapally Rajesh
ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అనుసరించే వైఖరి వివాదాస్పదంగా మారుతుంది. రాజకీయంగా దీన్ని విపక్షం సమర్ధవంతంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నా సరే ఏపీ ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రాకపోవడం కలవరపెడుతున్న అంశంగా చెప్పాలి. ఏపీలో నరేగా  బిల్లుల అంశానికి సంబంధించి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా నరేగా  బిల్లులకు సంబంధించి ఏపీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. నరేగా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేయడం పై ఏపీ  ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
వచ్చే నెల 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఆరోజు ప్రధాన కార్యదర్శి కోర్టు ముందు నరేగా బిల్లుల చెల్లింపు పై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ హైకోర్ట్. నరేగా బిల్లులు చెల్లింపు పై హైకోర్టులో విచారణ సందర్భంగా విజిలెన్స్ ఎంక్వయిరీ  జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం... 20 శాతం మినహాయించుకుని బిల్లులను చెల్లిస్తున్నామని కోర్ట్ కి వివరించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు పిటీషనర్ తరపున న్యాయవాదులు.
తమకు బిల్లులు చెల్లించలేదని, విజిలెన్స్ విచారణ కూడా జరగడం లేదని హైకోర్టుకు న్యాయవాదులు వివరించారు. దీంతో జోక్యం చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారీ విజిలెన్స్ విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటిమాటగా చెబుతూ అఫిడవిట్ లు వేయకపోవడం ఏమిటని హైకోర్ట్ విచారణ సందర్భంగా నిలదీసింది. ఎన్ని కేసులలో విచారణ జరుగుతుంది, ఎంతమందికి బిల్లులు చెల్లించారు.. ఎంతమందికి 20శాతం మినహాయించారో, వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం. వచ్చే నెల 4వ తేదీన ఛీఫ్ సెక్రటరీ హైకోర్టుకు రావాలని న్యాయమూర్తి భట్టు దేవానంద్ ఆదేశాలు ఇచ్చారు. ఆరోజు ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చారు.కాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సమీర్ శర్మ వచ్చే నెల ఒకటిన బాధ్యతలు చేపడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: