అర‌వింద్ చెప్తే కేటీఆర్ రాజీనామా చేస్తాడా?

RATNA KISHORE
నిధుల విష‌య‌మై ఈ రోజు నిజ‌మాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ సీరియ‌స్ అయ్యారు. తాము త‌క్కువ నిధులు ఇస్తున్నామ న్న‌ది నిరూపిస్తే రాజీనామా లేఖ‌తో కేటీఆర్ త‌మతో చ‌ర్చ‌కు రావాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి వ‌సూలు అవుతున్న ప న్నుల కంటే తాము ఇస్తున్న‌దే అధిక‌మ‌ని తేల్చేశారు. దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అయింది. అర‌వింద్  చెప్పినంత మాత్రాన కేటీఆర్ రాజీనామా చేయ‌రు? అలా అని విమ‌ర్శ‌ల‌పై మాట్లాడ‌కుండా మౌనం వ‌హించ‌రు. గ‌త కొద్ది కాలంగా కేంద్రం రాష్ట్రాల‌కు ఇస్తున్న నిధుల విష‌య‌మై ఎన్నో వివాదాలు రేగుతున్నాయి. అవి ఎక్క‌డా ఆగ‌డం లేదు. తాము జీ ఎస్టీ క‌లెక్ట్ చేసి ఇచ్చినా తిరిగి చెల్లింపుల్లో అన్యాయం త‌ప్ప ప్ర‌యోజ‌నం కానీ ప్ర‌జోప‌యోగం కానీ ఏమీ లేద‌ని రాష్ట్రాలు పెద‌వి విరు స్తున్నాయి. అలానే ఆర్థిక లోటు స‌వ‌రించేందుకు కేంద్రం చేయాల్సిన సాయం కూడా చేయ‌డం లేద‌ని, మీ అప్పులు మీ ఆదాయం మీ తిప్ప‌లు అన్న విధంగా న‌డుచుకోవ‌డం ఎంత మాత్రం స‌మంజ‌సం కాద‌ని అంటున్నాయి.


ఇంకా చెప్పాలంటే......
బీజేపీ, టీఆర్ఎస్ రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్కాయి. ఢిల్లీలో చెట్ట‌ప‌ట్టాలు వేసుకునే ఆ రెండు పార్టీలూ రాష్ట్రంలో మాత్రం ఒక‌దానినొ క‌టి తెగ తిట్టుకుంటాయి. మోడీతో ఎటువంటి విభేదం లేద‌న్న విధంగానే కేసీఆర్ పైకి ప్ర‌వ‌ర్తించినా, రాష్ట్రంలో బీజేపీ ఏ చిన్న విమ ర్శ చే సినా వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చి త‌న పంతం నిరూపించుకుంటారు. అంత‌గా ద్వంద్వ వైఖ‌రితో రాజ‌కీయాలు చేసే పార్టీ అధినేత‌గా అటు కేసీఆర్ కానీ ఇటు బీజేపీ కానీ ఉన్నాయా? అన్న‌దే ప్ర‌ధాన సందేహం. కేసీఆర్ చెప్పిన విధంగా రాజ‌కీయం న‌డ‌ప‌డం కొంద రికి మాత్ర‌మే సాధ్యం. ఎందుకంటే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ భ‌వ‌న్ కోసం స్థ‌లం అడిగినా, సొంత పార్టీ కార్యాల‌యం నిర్మాణానికి స్థ‌లం పొందినా ఇలా ఏం చేసినా అవ‌న్నీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే అని చెప్పుకుని తిరిగే స‌త్తా కేసీఆర్ కే సొంతం. కానీ నిధుల విష‌య మై అర‌వింద్ చెప్పే మాట‌ల్లో విశ్వ‌స‌నీయ‌త ఎంత‌? ఎంత వ‌రకూ న‌మ్మాలి ? ఎంత వ‌ర‌కూ న‌మ్మ‌కూడ‌దు అన్న‌వి ప్ర‌జ‌ల‌కు విడ మ‌ర్చి చెప్పే బాధ్య‌త కేటీఆర్ దే! ఎప్ప‌టి నుంచో నిధుల‌పై లొల్లి ఉంద‌ని, దీనిపై ఎవ‌రి క్లారిఫికేష‌న్ వారిదేన‌ని కొంద‌రు ప‌రిశీలకు లు అంటున్నా, నిజాలు ఎవ‌రి పక్షాన ఉన్నాయో తెలియాలంటే కేటీఆర్ స్పందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: