చైత్ర కేసులో చేదు నిజం రాజ‌కీయం ?

RATNA KISHORE
ఏం చేసినా చేయ‌కున్నా చిన్నారికి న్యాయం చేయండి..చిన్నారి మ‌ర‌ణానికో నివాళి..నిందితుడి విష‌య‌మై చ‌ట్టం తీసుకునే చ‌ర్య లు..ఇవి కాద‌ని మీరు రాజ‌కీయం చేసి ఏం  సాధిస్తారు? ష‌ర్మిల రాజ‌కీయం, రేవంత్ రాజ‌కీయం కార‌ణంగా స‌మ‌స్య‌లు స‌మ‌సిపో వు. వారి రాక కార‌ణంగానే నిందితులు త‌మంత‌ట తాము పోలీసుల ఎదుట లొంగిపోరు. కేవ‌లం మీడియాలో హంగామా కోస‌మే ఇదంతా అన్నదే వాస్త‌వం. ఇవ‌న్నీ కాదు ష‌ర్మిల అడుగుతున్న విధంగా ప‌దికోట్ల రూపాయ‌లు ప్ర‌భుత్వం చెల్లించిందే అనుకోండి ఆ డ‌బ్బుల‌తో చిన్నారి ప్రాణం తెచ్చి ఇస్తారా? అసమంజ‌సం అయిన డిమాండ్ల కార‌ణంగా స‌మ‌స్య‌లు స‌మ‌సిపోవు అన్నది ఒక్క‌టి గ్ర‌హించండి.


బిడ్డ పోయిన దుఃఖంలో ఆ త‌ల్లీ ఆ తండ్రీ నిమిష‌మొక యుగంలా గ‌డుపుతున్నారు. త‌మ‌కు న్యాయం చేయ‌మ‌ని హృద‌య విదా ర‌కంగా వేడుకుంటున్నారు. బాధిత కుటుంబానికి అండ‌గా ఉండాల్సిన రాజ‌కీయ నాయ‌కులు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుని పోతున్నారు. ఇప్పుడు ఎవ‌రు స‌మ‌ర్థులు ? ఎవ‌రు అస‌మ‌ర్థులు? బిడ్డ ప్రాణం పోగొట్టుకుని కోలుకోలేని స్థితిలో మ‌నో వేద‌న‌ను అ నుభ‌విస్తున్న కుటుంబానికి ప‌రామ‌ర్శ‌లు ఎంత మేర‌కు ఊర‌ట‌నిస్తాయి. వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. చిన్నారి ఉదం తం మ‌రువ‌క ముందే మ‌రో ఉదంతం ఆంధ్రాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా లో ఓ దారుణాన్ని ముందే గుర్తించారు స్థానికు లు. ఇలాంటివెన్నో. అయినా స‌మాజంలో మార్పు రాదు. ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు. ఇలాంటి నిఛ‌మైన సంస్కృతి మ‌న మ‌ధ్యే ఉం టుండ‌గా వీటికి తోడు రాజ‌కీయం ఒక‌టి నిరంత‌రం కొత్త వివాదాలకు కార‌ణం అవుతోంది.


సైదాబాద్ ఉదంతం తెలంగాణ‌లో పెను సంచ‌ల‌నం రేపుతోంది. బాధిత కుటుంబం క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది. వీరిని ఓదార్చ డం ఎవ్వ‌రి త‌రం కావ‌డం లేదు. ఇంత‌టి దుఃఖంలోనూ రాజ‌కీయ నాయ‌కులు రాజ‌కీయాలే చేస్తున్నారు. ఇష్టం వ‌చ్చిన విధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఉదంతం నుంచి త‌మ‌ను తాము గెలిపించుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. కేసీఆర్ ను అస‌మ‌ర్థు డి గా చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఈ ఘ‌ట‌న‌పై రేగుతున్న వివాదాలు చిలికి చిలికి గాలివాన‌లు అవుతున్నాయి. సైదాబాద్ లో పుట్టిన తుఫాను ఇప్ప‌ట్లో తీరం దాటేలా లేదు. ఎందుక‌ని రాజ‌కీయ పార్టీల‌కు ఇంత ఆరాటం?


చిన్నారి చైత్ర హ‌త్యోదంతం రాజ‌కీయంగానూ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. స్పందించే నాయ‌కులు పూర్తిగా మాన‌వ‌త‌ను వ‌దిలి కేవ‌లం రాజ‌కీయ రంగు  పులిమేందుకే ప్ర‌య‌త్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ కానీ ఇటు వైస్సార్టీపీ కానీ ఇదే విధంగా త‌మ పంథాను కొన సాగిస్తున్నాయి. రాజకీయాలు మాట్లాడాల్సిన చోటే మాట్లాడండి అన్ని చోట్ల వ‌ద్దు అని కొంద‌రు హిత‌వు చెబుతున్నా అవేవీ పట్ట‌ని విధంగా రాజ‌కీయ పార్టీలు ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్టీపీ రంగంలోకి దిగింది. కేసీఆర్ స్పందించే వ‌ర‌కూ తాను దీక్ష‌ను వీ డబోన‌ని ష‌ర్మిల చెబుతున్నారు. ఇవి నిజంగానే బాధిత హృద‌యాల‌కు కొండంత అండ ఇచ్చే ప‌నులేనా అన్న సంశ‌యం ఒక‌టి రేగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: