బ్రేకింగ్: బ్యాంకులకు ఏపీ మంత్రి వార్నింగ్

Gullapally Rajesh
అన్ని జిల్లాల డీసీసీబీలు , డిసిఎంఎస్ ల పనితీరుపై వ్యవసాయ మంత్రి కన్నబాబు కీలక కామెంట్స్ చేసారు. డిసిఎంఎస్ ,  డీసీసీబీ ల బలోపేతానికి సీఎం పారదర్శక విధానాలను అమలు చేస్తున్నారు అన్నారు ఆయన. బ్యాంకు లు బ్రతకాలి వాటిని నష్టపరిచే పని చేసే ఎవ్వరిని ఉపేక్షించొద్దు అని స్పష్టం చేసారు. గుంటూరు , కృష్ణా జిల్లాల్లో  డీసీసీబీ ల పనితీరు మిగిలిన జిల్లాలకు ఆదర్శముగా వున్నాయి అని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో అయిదేళ్ల దాటినా మేనేజర్లను ట్రాన్సఫర్ చేసేలా చర్యలు తీసుకొండి అని ఆయన సూచనలు చేసారు.
సొసైటీ ల బైఫరికేషన్ , ఇతర మార్పులు చేర్పులు అంశాల్లో ప్రతిపాదనలు చేయండి అని కోరారు. రైతుల డబ్బు ని మనం అత్యంత బాధ్యతగా ఖర్చు చేయాలి అని కోరారు.  డీసీసీబీ , డిసిఎంఎస్ , పాక్స్ కు త్వరలో ఎన్నికలొస్తాయి అని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కౌలు రైతులకు రుణాలు ఇతర సేవలనందించే దిశగా చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. బ్యాంకు ల లావాదేవీలను చెక్ అండ్ బాలన్స్ చేసేలా ఆడిటింగ్ వ్యవస్థ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి అని మంత్రి కోరారు. వ్యవస్థ లో పని చేసే సిబ్బంది కోసం , వ్యవస్థ బలోపేతం కోసం హెచ్ ఆర్ పాలసీ ని సక్రమంగా అమలు చేయాలి అన్నారు.
ఆర్థిక స్థోమత వుండి కూడా రుణాలు తీసుకొని అప్పులు చెల్లించని రుణగ్రస్తుల వద్దనుండి కఠినంగా రికవరీలు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. తొలిదశలో చిత్తూర్ , ప్రకాశం , పశ్చిమ గోదావరి , గుంటూరు, కడప జిల్లాల్లో అముల్ ప్రాజెక్ట్ లకు బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. జిల్లాల్లోని బ్యాంకుల్లో పెండింగ్ కేసులు , వాటి విచారణ , అప్కోబ్ , ఆర్ సి ఎస్ , ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలపై చర్చించిన మంత్రి కన్నబాబు ...  డీసీసీబీ బ్యాంకుల చైర్మన్లు రుణాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి వత్తిడిలకు తలొగ్గద్దనే సీఎం ఆదేశాలను గుర్తించుకొండి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: