బ్రేకింగ్: కేసీఆర్ పై ధూళిపాళ్ళ ప్రసంశలు...?

Gullapally Rajesh
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన 93 శాతం కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర ఆరోపణలు చేసారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు రైతులను, వ్యవసాయాన్ని నిండా ముంచుతున్నాయి అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి అని ఆయన ఆరోపణలు చేసారు. డీఏపీ బ్లాక్ మార్కెట్లోనే దొరుకుతున్నాయి అని విమర్శించారు. ప్రభుత్వం గుత్తాధిపత్యం కోసమే రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
రైతులకు కావాల్సిన విత్తనాలు కూడా భరోసా కేంద్రాల్లో దొరకడంలేదు అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జగన్ ప్రభుత్వం తెలంగాణ కంటే వెనుకబడింది అని విమర్శించారు.  తెలంగాణ ప్రభుత్వం, రూ.16,700 కోట్లు వెచ్చించి 2020-21 నాటికి, కోటి 40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు కేవలం రూ.6,700కోట్లు మాత్రమే వెచ్చించింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. 2019-20 ఖరీఫ్ లో జగన్ ప్రభుత్వం కేవలం 14.47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే, తెలంగాణ ప్రభుత్వం 38 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది అని ఆయన పేర్కొన్నారు.
2020-21 ఖరీఫ్ లో ఏపీ ప్రభుత్వం 15.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటే,  తెలంగాణ ప్రభుత్వం 41.06 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది అని గుర్తు చేసారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన జొన్న, మొక్కజొన్న కేంద్రాలు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబులునింపాయి అని ఆయన విమర్శలు చేసారు. జగన్మోహన్ రెడ్డి రైతులను దోపిడీ చేస్తూ, వారి సంక్షేమాన్ని రంగు రంగుల ప్రకటనలకు పరిమితం చేసింది అని విమర్శించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద, 2019-20లో  రాష్ట్రంలో ఒక్కరైతుకి పంటల బీమా సొమ్ము అందలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.  ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో 2019-20లో రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన  రూ.1033 కోట్లను జగన్ ప్రభుత్వం కేంద్రానికి బకాయిపెట్టింది అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: