బ్రేకింగ్:ఆమరణ నిరాహార దీక్ష కు షర్మిల, మత్తులో కేసీఆర్...!

Gullapally Rajesh
సైదాబాద్ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధినేత వైఎస్ షర్మిల పరామర్శించారు. కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్ష కు కూర్చుంటా అని అన్నారు ఆమె. పదికోట్ల పరిహారం ప్రకటించాలి అని డిమాండ్ చేసారు. కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటె ఈయన రాష్ట్రాన్ని ఏం డెవెలప్ చేస్తాడు అని ఆమె నిలదీశారు. ఇక్కడ నీళ్లు దొరకవు, కానీ మద్యం ఏరులై పారుతుందంట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. పోలీసుల వైఫల్యం కాదా ఇది ప్రశ్నించిన ఆమె...
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ఈ సందర్భంగా నిలదీశారు. పోలీసులు ఎంతబాగా పనిచేస్తున్నారో తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ అన్నారు ఆమె. లాఠీఛార్జ్ చేసిమరీ చిన్నారి శవాన్ని గుంజుకుపోయారు అని విమర్శలు చేసారు. పోస్టుమార్టం కి తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా శవాన్ని గుంజుకుపోయి పోర్టుమార్టం చేయించారు అన్నారు ఆమె. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు అని ఆరోపణలు చేసారు. ప్రజల కోసం పనిచేయడంలేదు, కేసీఆర్ కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు.
ప్రజల టాక్స్ లతో జీతాలు తీసుకునే పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించకుండా కేసీఆర్ కోసం పనిచేస్తున్నారు అని విమర్శించారు. కేసీఆర్ ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్ను ఉద్యోగం నుంచి తీసేసిన కేసీఆర్, చిన్నపిల్లపై అత్యాచారం జరిగే ఎందుకు స్పందించరు నిలదీశారు. హంతకుడు దొరికాడా లేదా తెలుసుకొని మంత్రి ప్రజలకు సేవ చేసేందుకు ఎంత సమయం కేటాయిస్తున్నాడో అర్థమౌతుంది అన్నారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేని కేటీఆర్ మంత్రి కావడం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. కేసీఆర్ హుజురాబాద్ కే ముఖ్యమంత్రని... ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారు అని ఆరోపించారు. మహిళలపై లైంగికదాడులు సీఎం కేసీఆర్ హయాంలో మూడురెట్లు అధికమైయ్యాయి అన్నారు ఆమె. కేసీఆర్ ఫామ్ హౌస్ మత్తులోనే ఉంటారు అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: